చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మహిళలకు భద్రత ఉందని సీనియర్ కథానాయిక కాజోల్ అంటున్నారు. గతంలో పోల్చుకుంటే ప్రస్తుత ప్రొడక్షన్హౌస్లు పని ప్రదేశాల్లో మహిళానటులు, సిబ్బంది ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారన్నారు. పనిచేసే ప్రదేశాల్లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా సదరు నిర్మాణసంస్థలు చర్యలు చేపట్టాలన్నారు. షూటింగ్ జరిగే ప్రదేశాలు పెద్దవేమి కాదని ఎక్కడ ఏం జరుగుతోందో సెట్లో ఉన్న ప్రతిఒక్కరికి తెలుస్తుందన్నారు. ఏ రహస్యం దాగదని అందుకే అందరూ ఒకరినొకరు గౌరవించుకునే విధంగా మెలగాలని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం బాలీవుడ్ ఆ దిశగా పయనిస్తుందన్నారు. తాను నటిస్తున్న లఘుచిత్రం ‘దేవి’లో పనిచేసేవారందరూ కూడా మహిళలేనని తెలిపారు.లింగవివక్షత అనేది ఒక్క సినీపరిశ్రమలోనే కాదని ప్రపంచం మొత్తం అలాంటి ప్రమాదకర పరిస్థితిలోనే ఉందన్నారు. క్రమంగా ఈ దుస్థితి మారే రోజులు వస్తాయన్నారు. దేవి లఘుచిత్రం ద్వారా మహిళలపై ప్రస్తుతం జరుగుతున్న అకృత్యాలు, వాటిని ఎలా నివారించాలనే అంశాలు ప్రస్తావిస్తున్నామన్నారు. కాజోల్ చివరిగా ఆమె భర్త అజయ్‌దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘తానాజీ’ చిత్రంలో నటించింది.
చిత్రపరిశ్రమలో మహిళలు బానే ఉన్నారు

Related tags :