మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా) తొలిసారిగా పర్వతారోహణ (హైకింగ్) యాత్రని నిర్వహించింది. ఆరోగ్యం, శారీరక శ్రమ మరియు వ్యాయామంపై అవగాహన కల్పించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. జార్జియా లోని సానీ పర్వతం వద్ద ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పర్వతారోహణ ఆద్యంతం ఉత్సాహంగా సాయంకాలం వరకు సాగింది. మొత్తం 3మైళ్ల దూరాన్ని ప్రవాసులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అధిరోహించారు. తామా అధ్యక్షుడు భరత్ మద్దినేని, క్రీడల కార్యదర్శి రమేష్ వెన్నలకంటి, భరత్ అవిర్నేని, హితేష్ వడ్లముడి, రూపేంద్ర వేములపల్లి, శుశృత్ రెడ్డి బుసిరెడ్డి, రాజశేఖర్ చుండురి, శ్రీనివాస్ ఉప్పు, శివదేవభక్తుని , నాగేష్ దొడ్డాక, వాలంటీర్లు రాజేష్ జంపాల, అంజయ్య చౌదరి లావు, హేమంత్ వర్మ పెన్మెట్స, మురళి బొడ్డు, అనురాగ్ బండ్ల, ఉపేంద్ర నర్రా, వినయ్ మద్దినేని, నరేంద్ర సూరపనేని, మోనిష్ జంపాల, తనీష్ జంపాల తదితరులు పాల్గొన్నారు.
తామా ఆధ్వర్యంలో పర్వతారోహణ యాత్ర
Related tags :