*మాజీ మేయర్, తెదేపా నేత బంగి అనంతయ్య ఆత్మహత్య యత్న చేసారు. ఈరోజు ఆయన తన ఇంట్లో వురి వేసుకుని ఆత్మహత్య యత్నం చేసారు. భార్య, కూతురును కూరగాయల కోసం మార్కెట్ కు ఇంట్లో వురేసుకోబోయిన అనంతయ్య రాజకీయంగా అందరూ మోసం చేస్తారని ఆ ఆవేదనతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తుంది.
*పుదుచ్చేరికి చెందిన మంత్రి మొబైల్ ఫోన్ ను గుర్తుతెలియని ఇద్దరు దుండగులు లక్కేల్లరు. ఈఘటన సోమవారం రాత్రి స్థానికంగా ఉన్న బీచ్ లో చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి ఆర్. కమలా కన్నన్ సోమవారం రాత్రి బీచ్ లో వాకింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారు.
*గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం ఇరుకులపాలెంలోని ఈద్గా వెనుక పాతికేళ్ళ వయసున్న యువతి మృతదేహం లభ్యమైంది.
*నిద్రమత్తు ముగ్గురు ప్రాణాలకు బలితీసుకుంది పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
* పుల్వామా దాడి కేసుతో సంబంధం ఉన్న తండ్రీకూతుళ్లను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. పుల్వామాకు చెందిన పీర్ తారిఖ్ ఆయన కూతురు ఇన్షా జైషే మహ్మద్ టెర్రరిస్ట్ అదిల్ అహ్మద్‌దర్‌కు ఆశ్రయం ఇచ్చారని, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇన్షా జైషే గతంలో చాలా సార్లు టెర్రరిస్టులకు భోజన సదుపాయాలు, వాళ్లకు కావాల్సిన వస్తువులను సమకూర్చిందని అన్నారు. సోమవారం రాత్రి వాళ్ల ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటికి వరకు ముగ్గురు అరెస్టు అయ్యారు. టెర్రర్ అటాక్‌కు సహకరించిన జైషే మహ్మద్ సభ్యుడు షకీర్ బషీర్ మాగ్రేను పోయిన వారమే అరెస్టు చేశారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు దాడి చేయడంతో 40 మంది జవాన్లు చనిపోయారు.
* గుంటూరు జిల్లా మంగళగిరిలోని కాలేజీలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు వాడుతున్నారనే సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎనిమిది మంది విద్యార్థులను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
*తన సుస్వరంతో రేడియో వార్తలు చదువుతూ శ్రోతల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి (80) ఇక లేరు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమె మఅతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం జరుగనున్నట్లు వెల్లడించారు. సత్యవతి మఅతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె సేవలను సిఎం గుర్తు చేసుకున్నారు. సత్యవతి సుమారు నాలుగు దశాబ్దాలపాటు తన సుస్వరంతో రేడియో వార్తలు చదువుతూ లక్షలాది మంది శ్రోతల హఅదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారని సిఎం కొనియాడారు.
*అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. సీఐడీ కేసుల ఆధారంగా ఈసీఐఆర్‌ను ఈడీ నమోదు చేసింది.
*హయత్‌నగర్‌లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో ఈ తెల్లవారుజామున చోరీ జరిగింది. ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసిన దొంగలు అందులో ఉన్న నగదు అపహరించారు. దాదాపు రూ.లక్ష వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి చోరీకి పాల్పడటం ఇదే తొలిసారి కావడంతో పోలీసులకు సవాల్‌గా మారింది.
*వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో వారిని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. దొరబాబు, పరదేశి హైపర్ ఆది టీమ్‌లో కంటెస్టెంట్లు అన్న సంగతి తెలిసిందే.
*గుంటూరు జిల్లా మంగళగిరిలోని కాలేజీలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు వాడుతున్నారనే సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎనిమిది మంది విద్యార్థులను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
* ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయగా జబర్దస్త్ కామెడీ షోకి చెందిన ఇద్దరు నటులు పట్టుబడ్డారు. వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. మాధవధారలో ఒక అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహింస్తున్న వారిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఒక మహిళతో పాటు నలుగురు విటులను పోలీసులు పట్టుకున్నారు. విటులు ఇద్దరూ.. దొరబాబు, పరదేశిగా గుర్తించారు. వీరిరువురూ జబర్దస్త్ కామెడీ షో నటులుగా మంచి గుర్తింపు పొందారు.
*వినూత్నంగా నిరసనలు తెలిపే తెదేపా సీనియర్ నేత, కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే గమనించిన స్థానికులు బంగి అనంతయ్యను కాపాడి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అనంతయ్యకు ప్రాణాప్రాయం లేదని కర్నూలు వైద్యులు తెలిపారు.
*పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాధపురం వంతెన వద్దఏపీ 37 Aw5777 తెల్లవారు జామున, స్విఫ్ట్ కారు కాలువలో బోల్తా. ముగ్గురు దుర్మరణం.అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బయటకి తీసిన కారు.కప్పి శెట్టి సురేష్(22). కాజా గ్రామం చింత చిట్టియ్య (45). చౌధుల కాశీ (22).రొయ్యల సీడ్ కోసం వెళ్తున్న వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు.పంచనామా నిమిత్తం మృత దేహాలను పాలకొల్లు ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా పోలీసులు
* ఓ యువతికి రాంగ్కాల్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆపై అతని స్నేహితులను సైతం పరిచయం చేశాడు. చివరకు ఆమెను ఓ ప్రాంతానికి తీసుకెళ్లగా అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇది. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో జరిగింది.
*అవినీతి, అక్రమాలకు పాల్పడి భారీగా ఆస్తులు సంపాదించుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మాజీ అధికారి రమావత్ మోత్యా నాయక్, ఆయనకు సహకరించిన భార్య విజయలక్ష్మి, కుమారుడు కేశవ నాయక్లకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ ప్రత్యేక జడ్జి సాంబశివ నాయుడు మంగళవారం తీర్పు వెల్లడించారు.
*ఉగ్రవాది సయ్యద్ అబ్దుల్ కరీం టుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. హైదరాబాద్లో 1998లో గణేష్ ఉత్సవాల సందర్భంగా వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు టుండాపై కేసు నమోదైన విషయం తెలిసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఉత్తర్ప్రదేశ్లోని గాజియాబాద్ జైల్లో ఉన్న టుండాను అక్కడి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
* ఓ ఇంట్లోకి చొరబడిన అడవి పంది ముగ్గురిపై విరుచుకుపడింది. రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా వదల్లేదు. బాధితుల అరుపులు, కేకలు విని అప్రమత్తమైన బస్తీవాసులు రాళ్లతో బెదిరించడంతో పారిపోయింది. ఈ సంఘటన శంషాబాద్ పురపాలిక పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
*రేపటి పౌరుల జీవితాలకు బంగారు బాటలు వేయాల్సిన ఉన్నత వృత్తి ఆ ప్రధానోపాధ్యాయునిది. అతని బుద్ధి మాత్రం వికృతంగా మారింది. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలోని పద్మనాభునిపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం కొన్నిరోజులుగా విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు మంగళవారం తెలిపింది. దీంతో స్థానికులు పెద్దఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పోలీసులు కేసునమోదు చేశారు.
*ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్నం జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేయడంతో దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.
*పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి నరసాపురం కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. బాధితులు కారులో నరసాపురం మండలం మచ్చపురి నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో కారును వెలికితీశారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
ఆత్మహత్యకు ప్రయత్నించిన తెదేపా నేత-నేరవార్తలు
Related tags :