* కాలికి ముల్లు గుచ్చుకున్నా సరే… దాన్ని ఎలా తీయాలో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ చూసే కాలం ఇది.
ఏ చిన్న సమస్య వచ్చినా గూగుల్ తల్లి సహాయం తీసుకునేవారూ పెరిగారు.
దీంతో చిన్నచిన్న సమస్యలకు సైతం భయపడుతున్నారు. అదే ఆందోళన, కుంగుబాటుకు దారితీస్తోంది.
* ఏ వస్తువు ఉన్నా, లేకపోయినా సరే… ఫోన్ వెంట లేకపోతే మాత్రం ఇప్పటి వారు జీవించడం చాలా కష్టంగా భావిస్తున్నా రు.
?అదే ప్రపంచం కావడంతో ఇతరులతో మాట్లాడే అవకాశమూ తగ్గిపోయింది.
మొబైలే ప్రపంచంగా మారిపోయింది. వీటన్నింటితో ఎవరితో ఎలా ఉండాలో వారికి అర్థం కావడంలేదు.
?ఇతరులు ఓ మాట అన్నా… ఎలా స్వీకరించాలో తెలియని పరిస్థితి.
దాంతో ఏ విషయంలోనూ సర్దుకోలేకపోతున్నారు. చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో చూడటం మొదలుపెడుతున్నారు.
ఇవన్నీ ప్రవర్తనాపరమైన మార్పులకు దారి తీస్తున్నాయి.