20+ ఏళ్ల సుదీర్ఘ కెరీర్. ఎదుర్కోని ఆటుపోట్లు లేవు. పడని కష్టం లేదు. పురుషుల క్రికెట్ నీడలో ఎదిగి దిగ్గజంగా మారింది మిథాలీరాజ్. భారత మహిళల క్రికెట్ జట్టు సారథిగా ఆమె కీర్తి ఆకాశాన్ని తాకింది. కట్టుబాట్లను దాటి అమ్మాయిల ఆటకు దశ, దిశ చూపించింది. ఖేల్ రత్న, పద్మశ్రీ పురస్కారాలను అందుకుంది. కాగా ఆమె చీరకట్టుకొని క్రికెట్ ఆడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. సాధారణంగా క్రికెట్ అంటే జెర్సీ, ప్యాంటు ధరించి ఆడతారని అందరికీ తెలుసు. మరెందుకు మిథాలీ చీరకట్టుకొని ఆడిందనేగా మీ సందేహం. మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవం. అదే రోజున మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌తో హర్మన్‌ప్రీత్ సేన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడనుంది. తొలిసారిగా టీమ్‌ఇండియా ఫైనల్ చేరుకుంది. ఈ సందర్భంగా మిథాలీతో ఓ ప్రత్యేక వీడియో రూపొందించారు. కట్టుబాట్లను తెంచుకొని అమ్మాయిలు ఎదుగుతున్నారనేందుకు నిదర్శనంగా చీర కట్టుతో ఆమెను క్రికెట్ ఆడించారు. ‘టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ను స్వదేశానికి తీసుకురా’ అనే సందేశాన్ని జోడించారు.
ఇది చీర క్రికెట్
Related tags :