* ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో గోడౌన్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. గోడౌన్ యాజమాన్యం ఫైర్ ఇంజన్‌లకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు గోడౌన్ యాజమాన్యం తెలిపింది.
* మండపేటలో దారుణం జరిగింది. ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేటు కళాశాలలో మొన్న ఫేర్‌వెల్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత డిగ్రీ విద్యార్థిని ఒకరు స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లింది. ఇద్దరూ కలిసి సంగంపుంత కాలనీ వద్ద వున్న ఇటుక బట్టీ సమీపానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా నలుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. యువతి స్నేహితుడిపై దాడిచేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వల్లూరి రామకృష్ణ(కిట్టయ్య), సుంకర సత్యనారాయణ(వెంకన్న), చామంతి మధు, ములకల వీరబాబు తనపై దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం. గంగోత్రి ఘాట్ వద్ద అతివేగంతో చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం. ఒకరి మృతి. ఇద్దరి పరిస్థితి విషమం.
* దిశా పోలీస్ స్టేషన్ కు కైకలూరు నుంచి మొట్టమొదటి కాల్. ఆటో డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం వచ్చి దిశ పోలీస్ స్టేషన్కు దిశ యాప్ ద్వారా సమాచారం అందించిన మహిళ. మహిళకు మత్తుమందు ఇవ్వబోయిన ఆటోడ్రైవర్. ఎనిమిది నిమిషాల్లో అక్కడకు చేరుకుని మహిళను కాపాడిన పోలీసులు. కైకలూరు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్.
* నిర్భయ అత్యాచారం, హత్య దోషులకు ఉన్న చట్టపరమైన అవకాశాలన్నీ అయిపోయాయి. దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. గతంలోనే ముకేశ్, వినయ్, అక్షయ్‌ల క్షమాభిక్ష పిటిషన్‌లను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక దోషులను ఉరి తీయడమే మిగిలింది. మార్చి 3న ఉరి శిక్ష అమలు చేయాలని ఫిబ్రవరి 17న పటియాలా కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. న్యాయపరమైన అవకాశాల్ని ఉపయోగించుకోని పవన్‌గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. అత్యున్నత న్యాయస్థానం దాన్ని కొట్టి వేయడంతో చివరి మార్గంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు.
* గుండ్లమడుగు తండాలో దారుణం జరిగింది. తాండూరు మండలం గుండ్లమడుగు తండాలో కుటుంబ తగాదాలతో, ఇద్దరు పిల్లలను చెట్టుకు ఉరివేసి తండ్రి కూడా ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యాహ్నం వరకు కనిపించిన చిన్నారులు చనిపోవడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* విశాఖ నగరంతో పాటు విజయనగరం లోని పలు ప్రాంతాల్లో కార్లు అద్దెకి తీసుకుని తాకట్టు అమ్మిచేసే రెండు ముఠాలను పోలీసుల అదుపులో తీసుకొని సుమారు రూ 7 కోట్లు విలువ చేసే 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ లోనే కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా వివరాలు వెల్లడించారు.
* కామారెడ్డి జిల్లాలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ లంచం డబ్బులు, స్మార్ట్ ఫోన్ ను తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. నిజామాబాదు ఏసిబి డీ ఎస్పీ తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల రెవెన్యూ ఆర్ ఐ సుభాష్ మూడు వేల రూపాయలు ఒక్క స్మార్ట్ ఫోన్ లంచంగా తీసుకుంటూ ఏ సి బి అధికారులు పట్టుకున్నారు.సలీం అనే వ్యక్తి దగ్గర పట్టా మార్పిడి కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో ఏ సి బి ని ఆశ్రయించిన బాధితుడు.