కాకినాడకు చెందిన ఉండవల్లి లలిత అమెరికాలోని వర్జీనియాలో గల IAD విమానాశ్రయంలో గుండెపోటుతో మృతిచెందినట్లు గుర్తించారు. ఎమిరేట్స్ విమానంలో తన భర్త, కుమారుడితో కలిసి ఆమె అమెరికా పర్యటనకు బయల్దేరారు. వర్జీనియాకు ఇంకా 7గంటలు ఉందనగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. IADలో విమానం ల్యాండ్ అయ్యాక ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ఇమ్మిగ్రేషన్తో పాటు మృతదేహాన్ని భారతదేశం తరలించేందుకు కావల్సిన సహకారాన్ని తానా టీంస్క్వేర్ అందిస్తొంది.
వర్జీనీయా విమానాశ్రయంలో కాకినాడ మహిళ మృతి
Related tags :