DailyDose

తెలంగాణాలో మావోయిస్టు పోస్టర్లు-నేరవార్తలు

Maoist Posters Appear In Charla Mandal Of Telangana-Telugu Crime News Roundup

* చర్ల మండలం జీపీపల్లిలో మావోయిస్టు పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలంటూ మావోలు పిలుపు నిచ్చారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తే శిక్ష తప్పదని మావోయిస్టులు పోస్టర్లలో హెచ్చరించారు.

* బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే. బైలాదాకెరె వద్ద ఓ కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. అదే సమయంలో వేగంగా దూసుకొస్తున్న మరో కారు బోల్తా పడిన కారును ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జయ్యాయి. రెండు కార్లలో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

* పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పరిధిలో దారుణం. ఆస్తి కోసం తండ్రిని హతమార్చిన తనయుడు.

* నగరంలోని గోషామహల్ పోలీస్‌స్టేడియంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో స్టేడియంలో పలు కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వాహనాలను గోషామహల్ స్టేడియంలో భద్రపరుస్తారు. ఈ ప్రమాదంలో ఆయా వాహనాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. కాలిపోయిన వాహనాలన్నీ ప్రస్తుతం స్క్రాప్‌గా మారాయని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

* మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ నగలతో బ్యాంకు అప్రైజర్ ఖాతాదారులను బురిడీ కొట్టింది. బ్యాంక్‌లో కొత్త అకౌంట్లు ఓపెన్ చేసి. గోల్డ్ లోన్లను స్వాహా చేశారు. దాదాపు 500 మంది ఖాతాదారుల పేర్లతో రోల్డ్‌గోల్డ్ తాకట్టుపెట్టిన అప్రైజర్. లక్షల్లో బ్యాంక్‌‌కు టోపీపెట్టాడు. అనుమానం వచ్చిన మేనేజర్ నగలను తనిఖీ చేయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నగలు సరిచూసుకోవాలని మేనేజర్ విజ్ఞప్తి చేయడంతో, ఆందోళనతో ఖాతాదారులు బ్యాంకుకు క్యూ కట్టారు.

* జగ్గయ్యపేట మండలం ముత్యాలలో శుక్రవారం ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన గ్రామసభ, రసాభాసగా మారింది. వైసిపి లోని రెండు వర్గాల మధ్య బాహాబాహి నెలకొంది. లాటరీ తీసే సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు లాఠీచార్జ్‌ చేశారు శుక్రవారం ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. వైసిపి లోని రెండు వర్గాల మధ్య బాహాబాహి నెలకొంది. లాటరీ తీసే సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు లాఠీచార్జ్‌ చేశారు.

* కడప జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని చిన్న ఓరంపాడు వద్ద ప్రధాన రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లంపేట మండలం చెన్నగారిపల్లె గ్రామానికి చెందిన నాగినేని పాపయ్య(42), తల్లి సుబ్బమ్మ (60),  కుమారుడు హరిచరణ్‌ (8) కువైట్‌ నుంచి చెన్నైకి వచ్చారు. అక్కడి నుంచి స్వగ్రామమైన పుల్లంపేటకు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో ఓరంపాడు ప్రధాన రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారును కడప నుంచి తిరుపతికి వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

*