Kids

పిల్లలూ…శానిటైజర్ చేద్దాం రండి.

Telugu Kids Learning Activities-How To Make Sanitizer-Kids Version

చేతులు శుభ్రంగా ఉంటే వ్యాధులని దూరంగా ఉంచొచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి చేతులని శుభ్రంగా ఉంచడానికి వాడే శానిటైజర్‌ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చని తెలుసా? శానిటైజర్‌ని తయారుచేయడానికి అలొవెరా జెల్‌తో పాటు మరేం కావాలో చూడండి.

కావాల్సినవి: అలోవెరా జెల్‌- మూడు టేబుల్‌ స్పూన్లు, విటమిన్‌-ఇ ఆయిల్‌- అర చెంచా, టీ ట్రీ ఎసెన్షియల్‌ ఆయిల్‌- ఇరవై చుక్కలు, లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌- పది చుక్కలు, ఆల్కహాల్‌- ఒక చెంచా

తయారీ: వీటన్నింటినీ పెద్ద మగ్గులో తీసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత సీసాలో లేదా ఇంట్లో వాడేసిన ఫేస్‌వాష్‌ ట్యూబ్‌లలో నిల్వ చేసుకుని వాడుకోవచ్ఛు ఈ మిశ్రమం ఏడాదిపాటు నిల్వ ఉంటుంది.