తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విధర్భ నుండి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి 2.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీని ఫలితంగా నేడు, రేపు నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్ పట్టణం, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం నాడు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణాలో మూడురోజులు వర్షాలు
Related tags :