Politics

నిఘా యాప్ సీఎం ఎలా ఆవిష్కరిస్తారు?

Chandrababu questions YS Jagan releasing nigha app

చంద్రబాబు, టీడీపీ అధినేత

హడావుడిగా స్థానిక సంస్ధల ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది.

ఇంతటి గందరగోళంగా షెడ్యూల్ ఎప్పుడూ లేదు.

నిన్న మధ్యాహ్నం వరకు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తూనే ఉన్నారు.. సాయంత్రం పార్టీల సమావేశం పెట్టారు.

నిఘా యాప్ సీఎం ఎలా ఆవిష్కరిస్తారు..? సీఎం సూపర్ ఎన్నికల కమిషనరా..?

నిఘా యాప్ ఆవిష్కరించడం నిబంధనలకు విరుద్దం.

ఎన్నికల ప్రకటన చేశాక నిఘా యాప్ ఎలా ఆవిష్కరిస్తారు..?

ఎన్నికల కోడ్ వచ్చాక సీఎం రివ్యూలు చేయడానికి కూడా లేదు.

ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనులనూ సీఎం చేస్తారా..?

ఎన్నికలను ఈ ప్రభుత్వం అపహస్యం చేస్తున్నారు.

గత తొమ్మిది నెలలపాటు ప్రభుత్వం ఏం చేస్తోంది.. మొద్దు నిద్ర పోయిందా..?

గతంలో వేసివ రంగులతో మాకు సంబంధం లేదు.. కొత్తగా వేయడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ చెప్పడం సరికాదు.

బీసీల రిజర్వేషన్లు గణనీయంగా పడిపోతున్నాయి.

నెల్లూరు జిల్లాలో బీసీ రిజర్వేషన్లు కేవలం 10.49 శాతం మాత్రమే ఇచ్చారు.

బీసీలకు 34 శాతానికంటే ఎక్కువ సీట్లే ఇస్తాం.

కానీ చట్టపరంగా ఇచ్చే రిజర్వేషన్లను ఎందుకు తొలగించారు..?

నెల్లూరులో 16 మండలాల్లో బీసీల్లో ఒక్కరికి సీటు రాకుండా పోయింది.

నెల్లూరులో 46 ఎంపీపీల్లో కేవలం 6 ఎంపీపీ స్థానాలు మాత్రమే బీసీలకు వస్తున్నాయి.

90 శాతం సీట్లు గెలవకుంటే మంత్రి పదవులు ఊడతాయని ఎలా బెదిరిస్తారు..?