Food

ఖర్జూరం తింటున్నారా?

Eat Dates For Fiber And Constipation Relief

ఖర్జూరం శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ఒకటి. ఇందులో అనేక పోషకాలున్నాయి. నీరసం రాకుండా ఉండేందుకు చాలామంది ఉపవాసం ఉన్న సమయాల్లో ఈ పండ్లను ఎక్కువగా తింటుంటారు. ఇందులోని పోషకాలు, తింటే లాభాలు ఇవీ. ఇందులో విటమిన్‌ ఎ, బిలతో పాటు క్యాల్షియం, ఐరన్‌, పాస్పరస్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉన్నాయి. రోజూ రెండు ఖర్జూర పండ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. గుండె నీరసం ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్నిస్తుంది. ఇందులో గ్లూకోజ్‌, ఫక్టోజ్‌ అధికం. ఈ పండ్లు తిన్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణమే శక్తిని అందిస్తాయి. ఖర్జూరం గుజ్జును పాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మంచిది. ఖర్జూరంలో ఉండే ఫైబర్‌ మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తిని కలిగి ఉంటుంది. మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో నాలుగైదు ఎండు ఖర్జూరాలను నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని బాగా పిండి ఆనీటిని తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య తగ్గుతుంది. ఒక చిన్న జార్‌లో మూడు వంతుల తేనె తీసుకోవాలి. గింజలను తీసిన ఎండు ఖర్జూరా పండ్లను వేయాలి. ఆ జార్‌ను బాగా షేక్‌ చేసి వారం రోజుల పాటు పక్కనపెట్టి ఉంచాలి. వారం తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినాలి. ఇలా చేస్తే దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గుతాయి.