నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖైరతాబాద్‌లోని వాసవీభవన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి వాసవీభవన్ 3వ అంతస్తులో గది అద్దెకు తీసుకున్న మారుతీరావు ఆదివారం ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే మారుతీరావు మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యా?లేక సాధారణ మరణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Flash: మిర్యాలగూడ మారుతీరావు మృతి
Related tags :