* సాధన సర్గం (జననం 7 మార్చి 1969) భారతీయ సినిమాలో ప్లేబ్యాక్ కెరీర్‌కు పేరుగాంచిన భారతీయ గాయని. ఆమె నేషనల్ ఫిల్మ్ అవార్డు మరియు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ గ్రహీత. ఆమె ఐదు మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డులు, నాలుగు గుజరాత్ స్టేట్ ఫిల్మ్ అవార్డులను కూడా గెలుచుకుంది మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘లతా మంగేష్కర్ అవార్డు’ కూడా అందుకుంది. భారతీయ సినిమాల్లో బాగా తెలిసిన గాయకులలో సాధన సర్గం ఒకరు. ప్రస్తుతం ఆమె 35 భారతీయ ప్రాంతీయ భాషల్లో పాడుతోంది. సాధనను బాలీవుడ్ మెలోడియస్ క్వీన్ అని పిలుస్తారు. ఆమె మధ్య – ప్రదేశ్ ప్రభుత్వం నుండి లతా మంగేష్కర్ అవార్డు గ్రహీత. ఆమె జాతీయ చలనచిత్ర పురస్కారం, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఐదు మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డులు, నాలుగు గుజరాత్ స్టేట్ ఫిల్మ్ అవార్డులు మరియు ఒక ఒరిస్సా స్టేట్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకుంది. ఆమె 35 ప్రాంతీయ భాషల్లో 15000 పాటలను రికార్డ్ చేసింది. బహుభాషా ప్లేబ్యాక్ సింగర్ సాధన సర్గం అనేక ప్రైవేట్ ఆల్బమ్‌లు మరియు పాటలను రికార్డ్ చేసింది. ఆమె ప్రధాన స్రవంతి హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళ రికార్డు జాబితాలు క్రింద ఉన్నాయి. గజనానా , ఆర్టియన్ , శ్రీ సాయి మంత్రం , శ్రీ రామ్ మంత్రం మరియు జై అంబే మాతో సహా వేలాది భక్తి హిందూ ఆల్బమ్‌లను కూడా ఆమె విడుదల చేసింది. “సాయి రామ్ సాయి శ్యామ్” లో ఆమె చేసిన ప్రదర్శన భక్తులలో విపరీతమైన ప్రజాదరణ పొందింది.
* రెండు జాతీయ అవార్డులు… ఎనిమిది ఫిలింఫేర్ అవార్డులు… పలు భాషల్లో 500 సినిమాలు… అంతర్జాతీయ సినిమాల్లో విలక్షణ పాత్రలు… నాటక రంగంలో తనదైన ముద్ర… భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు… నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు… ఇవన్నీ నటుడు అనుపమ్ ఖేర్ వైవిధ్యానికి కొలమానాలు. ‘సర్ఫరోష్’, ‘రామ్‌లఖన్’, ‘లంహే’, ‘డర్’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ లాంటి ఎన్నో బాలీవుడ్ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుపమ్‌ఖేర్, ‘బెండ్ ఇట్ లైక్ బెక్‌హామ్’, ‘లస్ట్ కాషన్’, ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ లాంటి అంతర్జాతీయ సినిమాల్లో కూడా నటించి ప్రపంచ ప్రేక్షకులను మెప్పించాడు. సిమ్లాలో 1955 మార్చి 7న కాశ్మీరీ పండిట్ల కుటుంబంలో పుట్టిన ఇతగాడు, సినిమాలపై మోజుతో ముంబై చేరుకున్నాడు. నటుడిగా తొలి రోజుల్లో రైల్వే ప్లాట్‌ఫారంపై పడుకున్న రోజులున్నాయి. ముప్ఫై ఏళ్ల వయసులో ‘సారాంస్’ సినిమాలో చిన్న పాత్రతో మొదలైన సినీ ప్రస్థానం టీవీలు, నాటక రంగాలలో సాగుతూ ‘కర్మ’ (1986) సినిమాతో మంచి గుర్తింపుతో ముందుకు సాగింది. ఆపై అవకాశాలే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. పాత్రలే ఆయన్ను తీర్చిదిద్దాయి.
* ఎమ్మెస్ రామారావు (మార్చి 7, 1921 – ఏప్రిల్ 20, 1992) పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించాడు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామయణ భాగం సుందరకాండము ఎమ్మెస్ రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.