Health

వాటికన్ సిటీకి పాకిన కరోనా-TNI కథనాలు

New confirmed coronavirus cases in vatican city-Telugu health news

* కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందే మార్గాలు ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లోనూ ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా ఈ వైరస్‌ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. స్వీయ శుభ్రత పాటించాలి. తరచుగా చేతులు సబ్బు నీళ్లతో కనీసం 20 సెకన్లపాటు కడుక్కోవాలి.షదంగ్‌ పనియా (ముస్త, ఉషీర్‌, పర్పత్‌, చందన్‌, ఉదీచ్య, నగర్‌)లను ఒక లీటరు నీళ్లలో పది గ్రాముల చొప్పున కలిపి ఆ నీళ్లు సగం అయ్యే వరకూ మరిగించాలి. ఈ నీళ్లను సీసాలో నిల్వ చేసి, దాహం వేసిన ప్రతిసారీ తాగుతూ ఉండాలి.చేతులు కడుక్కోకుండా కళ్లు, ముక్కు, నోరు తాకకూడదు. వ్యాధిగ్రస్థులకు సన్నిహితంగా మసలకూడదు.సుస్తీగా ఉంటే ఇంటి పట్టునే ఉండిపోవాలి./తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు నోటికి, ముక్కుకు మడిచిన మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. తుమ్మినా, దగ్గినా వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. తరచుగా తాకే వీలున్న వస్తువుల ఉపరితలాలను శుభ్రం చేసుకోవాలి.కరోనా వైరస్‌ సోకినట్టు అనుమానం కలిగితే, ముఖానికి మాస్క్‌ ధరించి, దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్ట్‌ చేయించుకోవాలి. కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే వ్యాధి నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవడంతో పాటు, అందుకు తోడ్పడే జీవనశైలిని అనుసరించాలి. ఇందుకోసం ఆయుర్వేద మందులను కూడా వాడుకోవచ్చు. అగస్త్య హరితాకి 5 గ్రాములు రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.సంషామణి వటి 500 గ్రాములు రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 5 గ్రాముల త్రికటు (పిప్పళ్లు, మరీచి, శొంఠి) పొడి, 3 – 5 తులసి ఆకులు ఒక లీటరు నీళ్లలో వేసి, ఆ నీళ్లు సగం అయ్యేవరకూ మరిగించి, సీసాలో నింపాలి. ఈ నీటిని రోజంతా తాగుతూ ఉండాలి. ప్రతి రోజూ ఉదయం ప్రతిమర్స నస్య అను తైలం లేదా నువ్వుల నూనె రెండు చుక్కలు నాసికా రంద్రాల్లో వేసుకోవాలి.

* ► ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో 3,404 మంది మరణించారు. 99,464మందికి వైరస్‌ సోకింది.  

► చైనాలో శుక్రవారం  143 కేసులు నమోదైతే, 30 మంది మరణించారు.  మృతుల సంఖ్య 3,042కి చేరుకుంది.  

► చైనా తర్వాత దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, అమెరికా,  ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలో కరోనా ప్రభావం  ఉంది.  

► భూటాన్, సెర్బియా, కామరూన్, వాటికన్‌ సిటీలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూశాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు కేవలం జలుబు మాత్రమే ఉంది. నెదర్లాండ్స్‌లో ఓ వృద్ఢుడు చనిపోయారు.

► భూటాన్‌లో అమెరికా టూరిస్ట్‌కి కరోనా వైరస్‌ ఉన్నట్టు తేలిందని భూటాన్‌ ప్రధాని వెల్లడించారు.  

► అమెరికాలో 14 మంది ఇప్పటివరకు మరణించారు. కేసుల సంఖ్య 230కు పెరిగింది. కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికా భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు 8.3 బిలియన్‌ డాలర్లను కేటాయిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం సంతకం చేశారు. ఈ నిధులను వాక్సిన్ల తయారీ, పంపకం, పరీక్షల కోసం వినియోగించనున్నారు.    

► ఇరాన్‌లో 3,500 కేసులు నమోదై, 107 మంది మృతి చెందారు. పేపర్‌ కరెన్సీ వాడొద్దని ప్రజలను కోరింది.

► ఆస్ట్రేలియాలో కరోనా కేసుల సంఖ్య 61కి చేరుకుంది. వ్యాధి నివారణకు 100 కోట్ల డాలర్లు కేటాయించింది.

► చికిత్స సమయంలో     కరోనా రోగుల  హక్కుల్ని కాపాడవలసిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్‌ మిషెల్‌ బాచెలెట్‌ అన్నారు. మనుషుల మర్యాద, వారి హక్కుల్ని అన్ని దేశాలు కాపాడాలన్నారు.  

► ఆస్ట్రేలియాలో కరోనా నేపథ్యంలో టాయిలెట్‌ పేపర్లు ఎక్కడ దొరకవేమోనని భారీగా కొనుగోలు చేసి పెట్టడంతో బహిరంగ మార్కెట్‌లో వీటికి కొరత ఏర్పడింది. దీంతో ఎన్‌టీ న్యూస్‌ గురువారం అదనంగా ఎనిమిది పేజీలతో పేపర్‌ని వాటర్‌ మార్క్‌తో ముద్రించి, దానిని టాయిలెట్‌ పేపర్‌గా వాడుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ పేపర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆ పత్రిక ఆలోచన తమకు యమాగా నచ్చేసిందని కామెంట్లు పెడుతున్నారు.

* కరోనా వైరస్​పై వదంతులను నమ్మొద్దన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేదానిపై తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలు తీసుకోవాలన్నారు.

* కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో ఉన్న రెండు గ్రామాల్లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలోని కొడియతూర్‌, వెంగేరి గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడాన్ని గుర్తించిన అక్కడి అధికారులు ఆ కోళ్ల రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు. వాటిని విశ్లేషించిన భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌.. ఆ కోళ్లకు బర్డ్‌ ఫ్లూ ఉన్నట్లు నిర్దారించింది.

* కరోనా ఉందనే అనుమానంతో ఇరాన్​లోని భారతీయుల నమూనాలను ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకొచ్చారు అధికారులు. వీటిని పుణెలోని ఎన్​ఐవీ కేంద్రంలో పరీక్షించనున్నారు.