తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఖతార్‌లోని దోహాలో ఘనంగా జరిగాయి. ఇండియన్ కల్చరల్ సెంటర్‌లోని అశోక్ హాల్‌లో జరిగిన ఈ వేడుకలకు ఇండియన్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు ఏపీ మణికంఠన్, ఉపాధ్యకుడు వినోద్ నాయర్, ఐసీసీ మాజీ అధ్యక్షురాలు మిలన్ అరుణ్, ప్రముఖ సామాజిక, విద్యావేత్త కేఎస్ ప్రసాద్, ఐసీసీ కాన్సులర్ సర్వీసెస్ హెడ్ భూమేష్ పడాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళా దినోత్సవ వేడుకల్లో ఎన్‌ఆర్‌ఐ మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వేడుకల నిర్వహణలో భాగంగా మహిళా సాధికారతపై ప్యానెల్ డిస్కషన్, సాంప్రదాయ వస్త్ర ప్రదర్శన, మహిళా సమస్యలే ఇతివృత్తంగా పలురకాల స్కిట్స్, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్ని వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని మాట్లాడుతూ.. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశయాల మేరకు ఖతర్‌శాఖ తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణతో పాటు నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత వంటి అనే అంశాలపై పనిచేస్తున్నట్లు తెలిపారు. జాగృతి ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న మాట్లాడుతూ.. సాంప్రదాయ.. ఎక్స్‌ట్రార్డినరి ఇన్ సారీ అనే శీర్షికతో నిర్వహించిన వస్త్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
ఖత్తర్‌లో మహిళా దినోత్సవం
Related tags :