Movies

రజనీ చిత్రానికి కొరోనా దెబ్బ

Rajinikanth Annatha Schedule Changed Amid Coronavirus Fears

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అణ్ణాత్త’. శివ దర్శకత్వం వహిస్తున్నారు. మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తిసురేష్‌ కథానాయికలు. ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు, సూరి తదితరులు నటిస్తున్నారు. ఇమాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉండగా తదుపరి షెడ్యూల్‌కు కోల్‌కతా, పుణెలకు వెళ్లాలని చిత్రవర్గాలు అనుకున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈ షెడ్యూల్‌ను మార్చినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ హైదరాబాద్‌లోనే చిత్రీకరణ కొనసాగే అవకాశముందని తెలుస్తోంది.