Fashion

కందిన చర్మానికి సాంత్వన కలిగించే అలోవెరా

Aloevera for skin that is marred by heat and sun

పొడిచర్మం, మొటిమలు సమస్య ఏదైనా.. అలొవెరా గుజ్జు చక్కని పరిష్కారం చూపిస్తుంది…

* అలోవెరా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పొడి, జిడ్డు చర్మం ఉన్నవాళ్లు, మొటిమలు ఉన్నవాళ్లు ఎవరైనా దీనిని వాడొచ్ఛు అలొవెరాలోని నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల పొడి చర్మాన్ని కూడా మృదువుగా చేస్తుంది.

* అధిక వేడికి చర్మం కందిపోయినప్పుడు.. ఆ ప్రాంతంలో అలొవెరా గుజ్జుని రాస్తే ఉపశమనం లభిస్తుంది.

* వారంలో రెండు సార్లు అలొవెరా గుజ్జుతో ముఖానికి మసాజ్‌ చేస్తే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

* కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడినా, కళ్లు ఉబ్బినట్టుగా ఉన్నా అలొవెరా రసం రాస్తే ఫలితం ఉంటుంది.

* మొటిమలు, అలర్జీల నుంచి అలొవెరా రక్షణ కల్పిస్తుంది.

* అలోవెరా గుజ్జులో… కాస్త తేనె, నిమ్మరసం కలిపి రాస్తే ముఖం చక్కని కాంతితో మెరిసిపోతుంది.