అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఆటా ప్రతినిధులు, స్థానిక ప్రవాస మహిళలు, ఆటా 2020 16వ మహాసభల కార్యవర్గ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆటా అధ్యక్షుడు భీంరెడ్డి పరమేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పలు రంగాల్లో సేవలందించిన ప్రవాసులకు పురస్కారాలు అందజేశారు. లాస్ఏంజిల్స్‌లో జరగనున్న 16వ మహాసభలను విజయవంతం చేయవల్సిందిగా ఆయన కోరారు. ఈ సభల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
న్యూజెర్సీలో “ఆటా” మహిళా దినోత్సవం
Related tags :