ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామ పంచాయతీల్లో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో మాత్రం స్థానిక ఎన్నికలను మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించడంతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో విలీనం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.దీనిలో భాగంగానే రాజధాని పరిధిలోని యర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో.. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపే ప్రతిపాదన చేస్తోంది. నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండతో పాటు తుళ్లూరు మండలంలోని గ్రామాలను కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తుళ్లూరు మండలం త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు పూర్తిగా దూరం కానుంది.
అమరావతి గ్రామాల్లో ఎన్నికలు లేవు
Related tags :