Movies

త్రిష చేతిలో ఏడు ఉన్నాయి

Trisha On High Rise With 7 Movies In Hand

త్రిష నవ్వితే ఎవరైనా పడిపోవాల్సిందే. అంత ముద్దుగా ఉంటుంది ఆమె రూపం. దానికి తోడు చక్కటి అభినయం తోడైంది. 1999 ‘జోడీ’లో చిన్న పాత్రలో కనిపించిన ఆమె.. ఇప్పుడు దక్షిణాదిలో అగ్రతారగా వెలుగుతున్నారు. పలు తమిళ హిట్లు అందుకున్న తర్వాత 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’తో తెలుగు వారిని పలకరించారు. ఆపై ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘ఆరు’, ‘స్టాలిన్’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..’.. ఇలా దాదాపు అందరు అగ్ర కథానాయకుల సరసన నటించారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా త్రిష అదే ఫాంలో ఉన్నారు. ఇప్పటి హీరోల సినిమాలకు కూడా సంతకం చేసి హిట్లు అందుకుంటున్నారు. అంతేకాదు కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలతోనూ ఆకట్టుకుంటున్నారు. 2018లో ‘96’, 2019లో ‘పేట’లో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ కూడా ఉంది.