చిత్ర పరిశ్రమలో దర్శకురాళ్ల సంఖ్య చాలా తక్కువ. కొందరు మాత్రమే మెగాఫోన్ పట్టుకుని, అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సావిత్రి, విజయనిర్మల, జీవిత, నందినిరెడ్డి, సుధ కొంగర.. ఇలా కొంత మందే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఒకప్పటి హీరోయిన్ కల్యాణి చేరారు. ఆమె దర్శకత్వంలో చేతన్ శీను హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని కూడా కల్యాణి స్వీకరించడం మరో విశేషం. ఆమె k2k ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమా రూపుదిద్దుకుంటోంది. సినిమా ప్రీలుక్‌ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. కల్యాణికి శుభాకాంక్షలు చెప్పి, మద్దతు తెలిపారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం కీలక పాత్ర పోషించబోతున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ఆరంభం కాబోతోంది. చేతన్ ‘రాజు గారి గది’, ‘పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి సినిమాల్లో నటించారు. కల్యాణి ‘యాత్ర’ సినిమాలో చివరిసారి వెండితెరపై కనిపించారు.
నటి కళ్యాణి గుర్తుందా? ఇప్పుడు దర్శకురాలు.
Related tags :