WorldWonders

కామారెడ్డిలో చిరుత పిల్లలు

Leopard Kittens Found Inside Tree In Kamareddy

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని భవాని పెట్ గ్రామ శివారులో తాటి వాని మత్తడి ప్రాంతంలో రెండు చిరుత పులి పిల్లలను గ్రామస్థులు ఆదివారం గుర్తించారు. ఇంట్లో పని నిమిత్తం తాటి వాని మత్తడి నుంచి ఇసుకను తేవడానికి వెళ్ళిన గ్రామస్తులకు చెట్టు తొర్రలో వస్తున్న శబ్దాన్ని గమనించారు. దీంతో చెట్టు వద్దకు వెళ్లి చూడగా చెట్టు త్వరలో చిరుతపులి పిల్లలు ఉన్నట్లు గుర్తించి అడవి శాఖ ఆఫీసర్లకు సమాచారం అందించారు. వెంటనే ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రకాంత్రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వాటిని పరిశీలించి చిరుతపులి పిల్లలుగా గుర్తించారు. పిల్లలు ఉన్న ప్రాంతానికి ప్రజలెవరూ రావద్దని రేంజ్ ఆఫీసర్ గ్రామస్తులు సూచించారు. అనంతరం పిల్లలు ఉన్న చెట్టు కు ఆపోజిట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే బాగుండేది శివారులో చిరుత సంచారం ఉన్నట్లు తేలడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.వెంటనే చిరుతను పట్టుకొన్ని గ్రామస్తులను కాపాడాలని గ్రామస్తులు వేడుకొంటున్నారు.