Fashion

కీరదోశ రసంతో మెరిసే మోము

Telugu Fashion And Beauty News-Keera Juice For Glowing Skin

ఆరోగ్యానికే కాదు అందానికీ కీరదోస ఎంతగానో ఉపయోగపడుతుంది. అదెలాగంటే…
* తొక్క తీయని కీరదోస ముక్కలకు కలబంద రసం కలిపి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పావుగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖచర్మం మృదువుగా మారుతుంది.
* ముఖం ఎర్రగా కందిపోయినట్టుగా ఉంటే… తొక్క తీయని కొన్ని కీరదోస ముక్కల్లో చెంచా పెరుగు కలిపి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించి, పావుగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.
* ఎండలో తిరగడం వల్ల ముఖ చర్మం ఛాయ తగ్గినట్టుగా అనిపిస్తే… రెండు చెంచాల కీరదోస రసంలో చెంచా చొప్పున గులాబీనీరు, కలబంద రసం కలిపి ముఖానికి రాయాలి. బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఫేస్‌ ప్యాక్‌లు వేసుకోవడానికి ముందు ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.