DailyDose

ముగురు పిల్లలున్నా జడ్పీటీసీ ఎంపీటీసీకి అర్హులే-పుర ఎన్నికల ప్రత్యేక కథనాలు

Telugu Political News Roundup Today-ZPTC MPTC 2020 Andhra Eligibility Rules

* జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లను సమర్పించేందుకు ఈసీ అర్హతలు ప్రకటించింది. 1994, మే 30 నాటికి ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులేనని ఈసీ వెల్లడించింది. 1995 తర్వాత రెండో సంతానంగా కవలలు పుట్టడంతో.. ముగ్గురు ఉన్నా పోటీకి అర్హులని తెలిపింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేవారికి 21 ఏళ్ల వయసు తప్పనిసరి అని ఈసీ పేర్కొంది. ఎంపీటీసీకి పోటీ చేసేవారు ఆయా మండల పరిధిలోను, జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేవారు జిల్లా పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండాలి. వారిని బలపరిచే వారు సైతం జిల్లాలో ఏదో ఒక స్థానం పరిధిలో ఓటరై ఉండాలని ఈసీ స్పష్టం చేసింది. 

* ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్.. ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 31న (మంగళవారం) అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది.

* క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌

* ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు 13 జిల్లాల పరిశీలకులుగా సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులను నియామించిన ఈసీ…

(1) కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి – కర్నూలు జిల్లా.

(2) ఎం. పద్మ – కృష్ణ జిల్లా.

(3) పి.ఉషా కుమారి – తూర్పు గోదావరి జిల్లా.

(4) పి.ఎ. శోభా – విజయనగరం జిల్లా.

(5) కె. హర్షవర్ధన్ – అనంతపురం జిల్లా.

(6) టి. బాబు రావు నాయుడు – చిత్తూరు జిల్లా.

(7) ఎం. రామారావు – శ్రీకాకుళం జిల్లా.

(8) కె. శారదా దేవి – ప్రకాశం జిల్లా.

(9) ప్రవీణ్ కుమార్ – విశాఖపట్నం జిల్లా.

(10) బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా.

(11) పి. రంజిత్ బాషా – వైయస్ఆర్ కడప జిల్లా.

(12) కాంతిలాల్ దండే – గుంటూరు జిల్లా.

(13) హిమాన్షు శుక్లా – పశ్చిమ గోదావరి జిల్లా.

వీరికి అదనంగా ఉన్న నలుగురు సీనియర్ ఉన్నతాధికారులను సిహెచ్. శ్రీధర్, జి. రేఖ రాణి, టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్ రెడ్డి లను రిజర్వు లో ఉంచిన‌ ఈసీ.

* నేడు మున్సిపాలిటీ,కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్న ఈసీఒకే విడతలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలురాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీ, నగర పంచాయతీ లకు రిజర్వేషన్లు ఖరారుఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరణమార్చి 14 నామినేషన్లు పరిశీలనమార్చి 16 తేదీ 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణఅదే రోజు 3 గంటలు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు జాబితా ప్రకటనఈనెల 23 తేదీ ఉదయం 7 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు పోలింగ్మార్చి 27 తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంఈనెల 31 తేదీ పరోక్ష పద్ధతి లో కార్పొరేషన్ లకు మేయర్, డిప్యూటీ మేయర్, కో అప్షన్ సభ్యులు ఎన్నిక,మున్సిపాలిటీ లకు చైర్మన్, వైస్ చైర్మన్ లు ఎన్నిక జరుగుతుంది.