Politics

రంగులు సరిదిద్దండి-వైకాపాకు హైకోర్టు హెచ్చరిక

AP Highcourt Warns Jagan Govt To Change Colors

వైసీపీకి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ రంగులపై హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది.

పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులను 10 రోజుల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ భవనాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారమే మళ్లీ రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దీనికి సంబంధించిన నివేదికలను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని సీఎస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.

లేని పక్షంలో బాధ్యులను చేస్తామని చీఫ్‌ జస్టిస్ ధర్మాసనం హెచ్చరించింది.

పంచాయతీ భవనాలకు రంగులు వేయాలంటూ 2018 ఆగస్ట్‌ 11న పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఇచ్చిన మెమోను హైకోర్టు రద్దు చేసింది.