దక్షిణాదిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అమలాపాల్. 2014లో ఆమె తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. 2019 జులైలో విజయ్ రెండో వివాహం చేసుకున్నారు. తన జీవితంలోనూ ఓ వ్యక్తి ఉన్నాడని అమలాపాల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వ్యక్తి తన సినిమా స్క్రిప్టుల విషయంలోనూ సలహాలు ఇస్తుంటారన్నారు. అయితే అతడి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. కాగా ఇప్పుడు అమలాపాల్ ప్రియుడు ఇతనేనా? అంటూ అనేక కథనాలు వస్తున్నాయి. ముంబయికి చెందిన గాయకుడు భవిందర్ సింగ్‌తో అమలాపాల్ డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను ఆయన ఇప్పటికే పలుమార్లు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘నా బేబీ స్వస్థలంలో ఈస్టర్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నా’ అంటూ ఓ అమ్మాయితో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి బంధంపై వదంతులు మొదలయ్యాయి. దీంతో భవిందర్ సోషల్‌మీడియా నుంచి అమలాపాల్‌తో ఉన్న ఫొటోల్ని డిలీట్ చేశారు. అయినప్పటికీ వీరిద్దరి ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై అమలాపాల్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్‌లో ఆమె నటించబోతున్నారట.
సరికొత్త బంధం
Related tags :