కథానాయకుడు బాలకృష్ణ వేగం మామూలుగా ఉండదు. ఆయన రంగంలోకి దిగారంటే చాలు… అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే. ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. ఆ తర్వాత సినిమాకి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహ నాయుడు’ లాంటి విజయవంతమైన చిత్రాలు వారి కలయికలో వచ్చాయి. వీరిద్దరూ మరోసారి కలసి పనిచేయడం ఖాయం అయినట్టే. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న బోయపాటి సినిమా పూర్తికాగానే, విరామం కూడా తీసుకోకుండా కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగబోతున్నారట బాలయ్య. మేలో చిత్రీకరణని ఆరంభిస్తారని సమాచారం.
మరోసారి బాలయ్య చేత తొడగొట్టించనున్న బీ.గోపాల్
Related tags :