ScienceAndTech

డైవర్స్ మ్యాట్రిమోనీలో మహా మోసాలు

Hackers Cheating On Divorce Matimonial Websites

నగరంలో పోలీసుల కళ్లుగప్పి మ్యాట్రిమోనీ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా సైబరాబాద్ లో ఓ మహిళా డాక్టర్ మ్యాట్రిమోనీ ద్వారా మోసపోయింది. ఇటీవలే భర్తతో విడాకులు తీసుకున్న ఆమె మళ్లీ వివాహం చేసుకొనేందుకు భారత్ మ్యాట్రిమోనీలోని  డైవర్సీ మాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకుంది. ఆ మ్యాట్రిమోనీలో డాక్టర్ విపుల్ ప్రకాష్ అనే వ్యక్తి ఆమెతో పరిచయం చేసుకున్నాడు. యూకే(లండన్)లో డాక్టర్‌ను అంటూ ఆమెను నమ్మించాడు. అతనితో ఆమె చాట్ చేయడం ప్రారంభించింది. వాట్సప్, ఫేస్‌బుక్, మెయిల్స్ లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. తాను త్వరలోనే ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించాడు. నీకు నేను చాలా విలువైన బహుమతులు పంపుతున్నా వాటిని పొందాలంటే 7 లక్షలు ట్యాక్స్ కట్టాలని బుకాయించాడు. బహుమతి రూపంలో ఓ లాకర్ వచ్చింది. అందులో వజ్రాల నెక్లెస్ ఉంటుందని నమ్మిని ఆ మహిళా డాక్టర్ ఆ మొత్తాన్ని కట్టేసింది. తీరా చూస్తే అందులో ఏమీ లేదు. మోసపోయనని తెలిసి సైబర్ క్రైమ్ లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి మోసగాళ్లని పట్టుకున్నారు. ఈ మాట్రిమోనీ మోసాలు చేసే గ్యాంగ్‌లో మొత్తం అయిదు మంది ఉన్నారు. ఈ గ్యాంగ్‌లో ఇద్దరు నైజేరియన్లతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితుడు ఎసెలు ఉడో పరారీ ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. వీరిపై గతంలో బెంగళూరులో కేసులు ఉన్నట్లు కూడా తెలిసింది.