తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్‌ల జోరు పెరిగింది. ఇప్పుడు మరో రీమేక్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. కొరియన్ సినిమా ‘డ్యాన్సింగ్ క్వీన్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్టును నిర్మించబోతోంది. ఈ సినిమాలో కాజల్, అల్లరి నరేష్ నటించబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా నిర్మాత సురేష్‌బాబు ఈ వార్తలపై స్పష్టత ఇచ్చారు. ఇంకా ఈ చిత్రం దర్శకుడ్ని ఖరారు చేయలేదని చెప్పారు. ‘అవును.. ఈ సినిమా కోసం కాజల్‌ను సంప్రదించాం. ఆమె నటించేందుకు అంగీకరించారు. ప్రస్తుతం ప్లానింగ్ స్టేజీలో ఉన్నాం.. ఇంకా అన్నీ కుదరాల్సి ఉంది’ అని ఓ ఆంగ్ల మీడియాతో చెప్పారు. ‘డ్యాన్సింగ్ క్వీన్’ ఓ జంట కథ. తమ నిజ జీవితంలోని సమస్యలు ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించారనే నేపథ్యంలో సాగుతుంది. కాజల్ ప్రస్తుతం హిందీ సినిమా ‘ముంబయి సాగా’లో నటిస్తున్నారు. జాన్ అబ్రహం కథానాయకుడు. అదేవిధంగా కమల్ హాసన్ ‘భారతీయుడు 2’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 వేసవిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ‘ఈ ప్రాజెక్టుకు సంతకం చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. నా పాత్ర పరంగా ఇంకా సంతోషంగా ఉన్నా. దీని కోసం ఓ విద్య నేర్చుకోబోతున్నా. ఈ సినిమా నా కెరీర్‌కు మరింత బలం ఇస్తుంది’ అని ఇటీవల కాజల్ సినిమాను ఉద్దేశించి అన్నారు.
డ్యాన్సింగ్ క్వీన్ కోసం కాజల్
Related tags :