Fashion

బొద్దే ముద్దు

Obese Fashion In New York-Telugu Fashion News

అందానికి ఇదే సరైన నిర్వచనమని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. ఇంత ఎత్తు… ఈ కొలతలతో ఉంటేనే అందంగా ఉన్నట్టంటే.. సౌందర్యం అనే పదాన్ని కుదించినట్టే అవుతుంది. నిజానికి అది చూసేవారి దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్‌ షో ఈ విషయాన్నే నిరూపించింది. ఈ షోలో పదిమంది డిజైనర్లు పాల్గొంటే.. రెనెటైలర్‌ అనే డిజైనర్‌ ప్లస్‌సైజ్‌ ఫ్యాషన్‌ పేరుతో రూపొందించిన దుస్తులు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. ఈమె రూపొందించిన దుస్తులను వేసుకున్న మోడల్‌ భామలూ బొద్దుగుమ్మలే కావడంతో ఈ షోకి ఎక్కడలేని ఆదరణ లభించింది. లాస్‌వెగాస్‌కు చెందిన రెనె ప్రముఖులకే కాకుండా లావుగా ఉండి ఇబ్బందిపడే సామాన్యులకూ ఆకర్షణీయమైన దుస్తులను తయారుచేస్తోంది.