స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తన ఖాతాదారులకు రెండు శుభవార్తలు చెప్పింది. అన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్-AMB తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ఉన్న 44.51 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం రూరల్‌లో రూ.1000, సెమీ అర్బన్‌లో రూ.2000, మెట్రోలో రూ.3000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రూ.5 నుంచి రూ.15 వరకు ఛార్జీలను కూడా వసూలు చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలాంటి ఛార్జీల ద్వారానే బ్యాంకుకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని గతంలో లెక్కలు తేల్చాయి. ఖాతాదారులకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఆ నిబంధనను తొలగిస్తూ మినిమమ్ బ్యాలెన్స్‌ను ఎత్తేయడం ఖాతాదారులకు అతిపెద్ద శుభవార్తే.
SBI సేవింగ్స్ ఖాతాదారులకు శుభవార్త
Related tags :