* రాజ్యసభ ఎన్నికలకు తమ అభ్యర్థులను తెరాస ఖరారు చేసింది. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే)కు మరో అవకాశం కల్పించింది. ఆయనతో పాటు శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నిజామాబాద్‌కు చెందిన మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డికి రాజ్యసభ టికెట్ కేటాయించింది. వీరిద్దరూ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెరాసకు సంపూర్ణ ఆధిక్యం ఉండటంతో కేకే, సురేశ్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
*దిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సంస్థ దిల్లీ చీఫ్ పర్వేజ్ అహ్మద్‌తో పాటు, కార్యదర్శి మహ్మద్ ఇలియాస్‌లను దిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు దిల్లీ అల్లర్లకు నిధులను సమకూర్చినట్లు గుర్తించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న లోక్‌సభలో ప్రకటించిన నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
*ఇటీవల చంద్రబాబు ఉత్తరాంధ్రపర్యటనకు వెళ్ళగా అక్కడ ఆయనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముందస్తు అనుమతి తీసుకుని విశాఖ వచ్చినా ఆయనకు పోలీసులు 151 సీఆర్పీసి నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంలో విచారణ జరిపిన న్యాయస్థానం వివరణ ఇవ్వాల్సిందిగా డీజీపీ గౌతమ్ సవంగ్ ను ఆదేశించారు. దాంతో ఆయన ఇవాళ హైకోర్టు ముందుహాజరయ్యారు. కోర్టులో ప్రస్తుతం విచారణ షురు అవుతోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
*చీరాల తెదేపా సీనియర్ నేత ఎమ్మెల్యే కరణం బలరాం ఆపార్టీకి టాటా చెప్పేసి వైకాపా తేఎర్ధమ్ పుచ్చుకోబోతున్నారు ఈమేరకు అధికారిక ప్రకటన కూడా చేసారు. చీరాలలో తన కార్యాలయం నుంచి భారీగా అనుచరణ గణం, కార్యకర్తలతో కరణం.. అమర్వతిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి బయల్దేరారు ఆయన వైకాపాలో చేరుతున్నట్టు ప్రకటించిన అనంతరం తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు.
* వైకాపా శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన హైకోర్టు న్యాయవాది కిశోర్‌ను మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావటంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గాయాలు తగిలిన వెంటనే సకాలంలో మెరుగైన చికిత్స అందించలేదని వైద్యులు అభిప్రాయపడ్డారు. కొంతకాలం తమ పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు. కిశోర్‌పై దాడి ఘటనను న్యాయవాదులు సీరియస్‌గా తీసుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం కిశోర్‌ను పరామర్శించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెదేపానేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావుతో పాటు గుంటూరు జిల్లా మాచర్ల వెళ్లిన కిశోర్‌పై వైకాపా శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే.
* ఇరాక్‌లోని అన్బర్ ప్రావిన్స్‌లోని స్థానిక సాయుధ ముఠాల స్థావరాలపై అమెరికా గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. బుధవారం అక్కడి సాయుధ ముఠాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో సహా మొత్తం ముగ్గురు సైనికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతిదాడులకు దిగింది. ‘‘ఇరాక్‌లోని తాజి మిలిటరీ స్థావరంపై 15కి పైగా చిన్న రాకెట్లలతో దాడి చేశారు’’ అని అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాల ప్రతినిధి మైల్స్ కాగ్గిన్స్ ట్విటర్ ద్వారా తెలిపారు.
* నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని. శ్రీకాకుళంలో జెమ్స్, వాకర్స్ క్లబ్, క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం ఉదయం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయ ఉపకులపతి డాక్టర్ కూన రాంజీ విచ్చేశారు. ముందుగా జెండాను ఊపి కిడ్నీ దినోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పాల్గని శ్రీకాకుళం మెయిన్ సెంటర్‌లో బెలూన్లను వదిలి, మానవహారం చేపట్టారు…
* రాజ్యసభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ముంబయిలో ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతో కలిసి వెళ్లి నామినేషన్ సమర్పించారు. అలాగే ఒడిశాలో బిజెడి నేతలు మునా ఖాన్, సుభాష్ సింగ్, సుజిత్ కుమార్, మమతా మహంత తమ నామినేషన్లను దాఖలు చేశారు. బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ నేత బిశ్వజిత్ దైమారి గువహతిలోనూ, జెఎంఎం అధినేత శిబు సోరేన్ రాంచీలోనూ తమ నామినేషన్లను సమర్పించారు. ఈ నెల 26న పెద్దల సభకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే…
* దశలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ సురా జరుగుతోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతో వివిధ జిల్లాల్లోని సారా తయారీ కేంద్రాలపై డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ పర్యవేక్షణలో దాడులు జరిగాయి. ఒకేసారి దాదాపు 10 వేల మంది సిబ్బంది 759 ప్రాంతాల్లో ఈ దాడుల్లో పాల్గొన్నాయి. దాడుల్లో 4627 లీటర్ల సారాను, సుమారు 2312 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, అనుమతిలేని 24 వాహనాలను సీజ్ చేశామని, 702 మందిని అరెస్టు చేసి, మొత్తం 683 కేసులు నమోదు చేశామని ఉన్నతాధికారులు వెల్లడించారు…
* మీ ఇంటికొస్తే ఏమిస్తావు? మా ఇంటికొస్తే ఏంతెస్తావు? అనే టైపు జగన్ .రంగులేస్తే రూ.1300 కోట్లు, వాటిని తీస్తే రూ.1300 కోట్లు.. వాటేన్ ఐడియా జగన్ జీ అంటూ నారా లోకేశ్ ట్వీట్ .రూ.2600 కోట్లు పెడితే డ్వాక్రా మహిళలకు మీరు మాటిచ్చి తప్పిన రుణాలైన తీరేవి .ట్విట్టర్లోే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
* రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 20, 21న సెలవు ప్రకటించింది. ఎన్నికలు జరిగే 48 గంటలు ముందు పోలింగ్ ఏరియాలో మద్యం షాపులు మూసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్నీ సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక చర్యల్లో పాల్గొనాల్సి ఉన్నందున క్షేత్రస్థాయి వైద్యఆరోగ్యశాఖ సిబ్బందిని స్థానిక సంస్థల ఎన్నికల విధులకు వినియోగించొద్దని సీఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.
*ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 20, 21న సెలవు ప్రకటించింది అమరావతి,:రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 20, 21న సెలవు ప్రకటించింది.
ఎన్నికలు జరిగే 48 గంటలు ముందు పోలింగ్ ఏరియాలో మద్యం షాపులు మూసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్నీ సూచించారు.
* రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక చర్యల్లో పాల్గొనాల్సి ఉన్నందున క్షేత్రస్థాయి వైద్యఆరోగ్యశాఖ సిబ్బందిని స్థానిక సంస్థల ఎన్నికల విధులకు వినియోగించొద్దని సీఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు
*రాష్ట్రంలోని పాఠశాలలు ఈ నెల 16నుంచి ఏప్రిల్23 వరకు ఒంటి పూట పనిచేయనున్నాయి. ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలన్నీ 2019-20 విద్యావిషయక క్యాలెండర్ మేరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉదయం 7.45గం. నుంచి 12.30 గం.వరకు పనిచేస్తాయి.
*రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సారా తయారీ కేంద్రాలపై అధికార యంత్రాంగం బుధవారం మూకుమ్మడిగా దాడులు నిర్వహించింది. మద్య నిషేధంపై వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా డీజీపీ గౌతంసవాంగ్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్ పర్యవేక్షణలో 10వేల మంది సిబ్బందితో 759బృందాలు దాడులు జరిపాయి.
*మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన కొన్ని ఆస్తులను ఏప్రిల్ 16న వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ బుధవారం పత్రికా ప్రకటన ఇచ్చింది. గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకులో రుణం తీసుకోగా గంటా శ్రీనివాసరావు సహా పలువురు తమ ఆస్తులను ష్యూరిటీగా తనఖా పెట్టారు.
*రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక చర్యల్లో పాల్గొనాల్సి ఉన్నందున క్షేత్రస్థాయి వైద్యఆరోగ్యశాఖ సిబ్బందిని స్థానిక సంస్థల ఎన్నికల విధులకు వినియోగించొద్దని సీఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.
*రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 20, 21న సెలవు ప్రకటించింది. ఎన్నికలు జరిగే 48 గంటలు ముందు పోలింగ్ ఏరియాలో మద్యం షాపులు మూసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్నీ సూచించారు.
*కరోనా నియంత్రణ కోసం కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే దౌత్య, ఉపాధి వంటి కొన్ని రకాల వీసాలకు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
*జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజైన బుధవారం అధిక సంఖ్యలో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. ఎన్నికల్లో పలు పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నా ప్రధాన పోరు మాత్రం తెదేపా, వైకాపాల మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
*ఏడాదిలోగా రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య సూచిక నివేదికలు రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో సాగుతున్న ఈ ప్రక్రియను గజ్వేల్ నియోజకవర్గంలో.. తర్వాత రాష్ట్రమంతటికీ విస్తరింపజేస్తామన్నారు.
*తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ మంగళవారం తుదిఉత్తర్వులు జారీచేసింది. వీటిని అమలుచేయకపోతే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లుగా పరిగణించాల్సి ఉంటుందని రెండు రాష్ట్రాల సంస్థలకు స్పష్టం చేసింది. ఏపీ స్థానికత కలిగిన 1157 మందిని తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి 2015లో తెలంగాణ సంస్థలు రిలీవ్ చేశాయి. వారిని చేర్చుకునేందుకు ఏపీ సంస్థలు నిరాకరించడంతో వారు సుప్రీంకోర్టుకెళ్లారు
*ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలానికి నిలుపుదల చేసిన జీతాల చెల్లింపునకు మార్గం సుగమమైంది. ఇందుకోసం రూ.235 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు గతేడాది అక్టోబరు 5వతేదీ నుంచి నిరవధిక సమ్మె చేసిన విషయం తెలిసిందే. నవంబరు 26 నుంచి ఉద్యోగులు విధుల్లో చేరారు. 52 రోజుల సమ్మె కాలానికి అప్పట్లో జీతం చెల్లించలేదు. ఉద్యోగులు విధుల్లో చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో సమ్మె కాలానికి జీతం చెల్లిస్తామని ప్రకటించారు.
*ట్రో రైలు నిర్మాణంలో భాగంగా ప్రభావితమయ్యే వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పాతనగరంలో మెట్రో పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకూ 5 కి.మీ. మేరకు కారిడర్-2 పనులు చేపట్టామని, మిగిలిన తొలిదశ ప్రాజెక్టు పనులను పూర్తిచేశామని తెలిపారు. ఈ 5 కి.మీ. మెట్రో రైలు మార్గం పొడవునా 93 మతపరమైన, సమస్యాత్మకమైన కట్టడాలున్నాయనీ, వాటిలో దాదాపు 18 వరకూ రోడ్డు విస్తరణ, మెట్రో పనుల వల్ల ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. అయితే ఇంజినీరింగ్ నిపుణుల సలహాలు, సూచనలతో ఆ సమస్యలను పరిష్కరించి, కట్టడాలన్నింటినీ రక్షించాలని ఇప్పటికే ప్రతిపాదించామని మంత్రి చెప్పారు
*ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో అమలవుతున్న పథకాలకు రూ.550.63 కోట్ల నిధులకు ప్రభుత్వం బుధవారం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిస్తూ వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
*
*రంగారెడ్డి జిల్లాలో ఉప సంచాలకులు(డీడీ)గా పనిచేస్తున్న తేజోవతి, సుభోదినిలను ములుగు, నారాయణపేట జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ)గా నియమిస్తూ వ్యవసాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*పాత బకాయిలను వాయిదాల రూపంలో చెల్లించేందుకు అనుమతించాలని ఎన్టీపీసీకి తెలంగాణ ట్రాన్స్‌కో విన్నవించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గల ఎన్టీపీసీ విద్యుత్కేంద్రాల నుంచి నుంచి రాష్ట్రానికి రోజూ 1678.51 మెగావాట్ల కరెంటు సరఫరా అవుతోంది. సరఫరా తేదీ నుంచి 60రోజుల్లోగా సొమ్మును తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు చెల్లించాలనే నిబంధన ఉంది. ఇలా గడువుదాటినా రూ.2559.87 కోట్లు చెల్లించలేదని, వెంటనే చెల్లించకపోతే కరెంటు సరఫరా నిలిపివేస్తామని ఎన్టీపీసీ ఇటీవల డిస్కంలకు నోటీసు జారీచేసింది. రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడారు.
**తెలంగాణలో రెండు చోట్ల బంగారు నిల్వల అన్వేషణ ప్రాజెక్టులను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టినట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. జాతీయ ఖనిజ నిధి నివేదిక ప్రకారం 2015 నాటికి భారత్‌లో 1.72 కోట్ల టన్నుల బంగారు ఖనిజ నిల్వలున్నట్లు తేలిందన్నారు. బుధవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు.
*గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్ మంగళవారం ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. గవర్నర్ దంపతులు స్వయంగా దరఖాస్తులను పూర్తి చేసి, ఓటర్లుగా నమోదుకు అవసరమైన పత్రాలను అందజేశారు. త్వరలోనే జిల్లా పాలనాధికారి ద్వారా ఓటరు కార్డులు అందజేస్తామని అధికారులు వెల్లడించారు.
*మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైకోర్టు మహిళా న్యాయమూర్తులు, సీనియర్ మహిళా న్యాయవాదుల్ని సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం అందరూ కృషి చేయాలన్నారు. మాటలకు, పేపర్లకే మహిళా సాధికారత పరిమితం కాకూడదన్నారు. జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ టి.రజని, జస్టిస్ కె.విజయలక్ష్మి, సీనియర్ న్యాయవాదులు కె.శేషారాజ్యం, ఎం.భాస్కరలక్ష్మిలను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రవిప్రసాద్, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*ఎన్నికల వ్యయ పరిశీలకులు విధి నిర్వహణలో తటస్థంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని రమేశ్ కుమార్ సూచించారు. వ్యక్తిగత అవసరాలకు అత్యవసరంగా నగదు తీసుకెళ్లేవారిని వేధించారనే చెడ్డపేరు తెచ్చుకోవద్దన్నారు. 13 జిల్లాల వ్యయ పరిశీలకులతో ఆయన మంగళవారం సమీక్షించారు. ‘అభ్యర్థులు చేసే ఖర్చులపై పర్యవేక్షణ ఉండాలి. ప్రచారవ్యవధిలో ఎన్నికల వ్యయఖాతాలను తరచూ తనిఖీచేయాలి. ర్యాలీలపై దృష్టిపెట్టాలి. సున్నితమైన ప్రదేశాలను నిశితంగా పరిశీలించాలి. రోజూ ఎన్ని కేసులు నమోదయ్యాయో వివరాలివ్వాలి. జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలి’ అని ఆదేశించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు వీలైనన్ని ఎక్కువ శిక్షణ కేంద్రాలకు హాజరై సిబ్బందికి, అధికారులకు తగిన సూచనలివ్వాలని చెప్పారు.
*రాష్ట్ర విద్యుత్తు అభివృద్ధి కంపెనీ లిమిటెడ్(ఏపీపీడీసీఎల్) బ్యాంకుల నుంచి తీసుకునే రూ.2 వేల కోట్ల రుణానికి హామీ ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య, విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేయటానికి వెచ్చించనున్నారు
*గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. ఈమేరకు మాజీ మంత్రి, తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మంగళవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం చేపట్టిన అధ్యయనం ముగియలేదన్నారు. ఎలాంటి సిఫారసులు లేకుండా కేవలం ఒక భాగం నివేదికను మాత్రమే ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. శాసనసభ స్పీకర్ ప్రభుత్వానికి చేసిన సూచన ప్రకారం సిట్ ఏర్పాటు చేశారన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే రద్దు చేయాలని కోర్టును ఆయన అభ్యర్థించారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సైతం ఇదేవిషయమై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
*ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన 75 మంది ప్రయాణికులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. కరోనా వైరస్తో ఇటలీలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులపై అధికారులు ఆరాతీశారు. గతనెల 29 నుంచి 4 దశల్లో 75 మంది ప్రయాణికులు విశాఖ, నెల్లూరు, ఇతర ప్రాంతాలకు వచ్చారు. వీరి ఇళ్లకు వైద్యశాఖ అధికారులు వెళ్లి 14రోజులపాటు ఏకాంతంగా ఉండాలని, ఎవరినీ కలవొద్దని సూచించారు. ఇటలీ నుంచి వచ్చి ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థికి కరోనా ఉందన్న అనుమానం బలంగా వ్యక్తం కావడంతో నిర్ధారణ కోసం నమూనాలను పుణెకు పంపించారు. అలాగే అతని కుటుంబీకులను ఇంట్లోనే పరిశీలనలో ఉంచారు. వారి ఇంటి చుట్టుపక్కల ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి పైనా ఆరా తీస్తున్నారు. అనుమానితులు వాడిన టవల్స్, సబ్బులను మరొకరు ఉపయోగించకూడదని వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
*గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని బొమ్మరాజుపల్లిలో ఇళ్ల స్థలాల సేకరణకు ఆక్రమణల తొలగింపు వివాదాస్పదంగా మారింది. సర్వే నంబరు 165లో ఉన్న 9.80 ఎకరాల స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీన్ని కొంత మంది రైతులు ఆక్రమించుకుని పైర్లు సాగు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం తహశీల్దారు వి.కోటేశ్వరరావు, వీఆర్వో నాగరాజు పోలీసు సిబ్బందితో వెళ్లి ఆక్రమణలు తొలగించేందుకు పూనుకున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా.. పైర్లను ధ్వంసం చేయడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. అయినా అధికారులు ఆపలేదు. అర ఎకరా ఆముదం, అర ఎకరా పొగాకు పైర్లను ట్రాక్టర్లతో దున్ని చదును చేశారు. ఈ సందర్భంగా ట్రాక్టరును ఓ రైతు, ఆయన భార్య అడ్డుకున్నారు. ఒక రోజు సమయం ఇస్తే పంట కోసుకుంటామని అధికారులను కోరారు. దీంతో పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.
*ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ శాసనమండలి ఇన్ఛార్జి కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
*కశ్మీర్ లోయలో సినిమా షూటింగ్లకు ప్రోత్సాహకాలివ్వాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారమిక్కడ కిషన్రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల కశ్మీర్లో షూటింగ్లు జరగడం లేదని.. ప్రోత్సాహకాలు ఇస్తామని యూకే లాంటి దేశాలు ఆహ్వానిస్తున్నాయని తెలిపారు. కశ్మీర్లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. షూటింగ్లకు ప్రోత్సాహకాలు, భద్రత కల్పిస్తే పూర్వవైభవం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని కిషన్రెడ్డి హామీ ఇచ్చారు.
*ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం 2018 డిసెంబర్లో జారీచేసిన ప్రకటనలో దివ్యాంగుల కేటగిరీ కింద పోస్టులు కేటాయించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, ఏపీపీఎస్సీ తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గురువారం పోటీ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలన్న అధికారుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంపై అధికారుల వైఖరి తెలపాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.రజని మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
* కరోనా వైరస్ కారణంగా కేరళలో రేపటి నుంచి సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. ఈ మేరకు మలయాళ సినిమా సంస్థలు మంగళవారం కొచ్చిలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి మొదలై మార్చి 31 వరకు థియేటర్ల మూసివేత కొనసాగుతుందని వారు తెలిపారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. కేరళలో తాజాగా ఆరు కరోనా కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కేరళలో వైరస్ పాజిటివ్గా తేలిన వారి సంఖ్య 12కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను, పాఠశాలలను మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రజలు బహిరంగ సమావేశాలు, ఇతరత్రా బహిరంగ ఉత్సవాలకు మార్చి 31వరకు దూరంగా ఉండాలని సూచించారు
*కరోనా దెబ్బకు కుదేలైన వుహాన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మంగళవారం పర్యటించారు. వైరస్ నిరోధక చర్యలను పరిశీలించారు. పరిస్థితులు మెరుగుపడుతున్నందున హుబెయ్లో ప్రయాణాలపై ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. చైనాలో కొవిడ్-19 దెబ్బకు తాజాగా 17 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,136కు పెరిగింది.
*చారిత్రక కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణంలో పూర్వవైభవాన్ని సంతరించుకున్న తారామతి, ప్రేమావతి టూంబ్స్ను అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ రెండింటి మరమ్మతులు, పూర్వవైభవ పనుల కోసం అమెరికా రాయబార కార్యాలయం ఫిబ్రవరి 2019లో 1,03,000 డాలర్లను మంజూరు చేసింది
*ఇంటర్ ప్రశ్నపత్రం మారడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురైన సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో మంగళవారం చోటుచేసుకుంది. వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 24 మంది ఒకేషనల్ విభాగ విద్యార్థులు స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చారు. వారికి వర్క్షాప్ టెక్నాలజీ ప్రశ్నపత్రం రావాల్సి ఉండగా ఇంట్రడక్షన్ టు చైల్డ్కేర్ అనే మరో ప్రశ్నపత్రం వచ్చినట్లు గుర్తించారు. సిబ్బంది ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సత్తుపల్లి నుంచి సరైన ప్రశ్నపత్రాలను తెప్పించి ఇచ్చారు. అప్పటికే 45 నిమిషాలు ఆలస్యమైంది. అదనపు సమయం కేటాయించి పరీక్ష రాయించామని, తమకు వచ్చిన బండిల్స్ తప్పు కావడంతో ఇలా జరిగిందని ప్రిన్సిపల్ మేరీ ఏసుపాదం తెలిపారు.
*మహాత్మాగాంధీ అంటే ప్రస్తుత తరానికి చరఖా, ఖద్దరు, కళ్లజోడు మాత్రమే గుర్తుకొచ్చేలా ఆయన ఆహార్యానికి భారతీయులు ప్రాధాన్యమిస్తే.. ప్రపంచ దేశాలు గాంధీజీ ఆలోచనల్లోని లోతును అర్థం చేసుకుని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాయని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.
*బెంగళూరు తరహాలో ఆర్టీసీ బస్సులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మెట్రో రైలులోనూ ఇలాంటి చర్యలు చేపట్టాలన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా బెంగళూరులో ఆర్టీసీ బస్సుల పరిశుభ్రతపై అధికారులు తీసుకుంటున్న చర్యలను ఒక నెటిజన్ ట్విటర్ ద్వారా కేటీఆర్కు తెలియజేశారు. స్పందించిన మంత్రి.. బెంగళూరు మాదిరిగా ఆర్టీసీలో చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ను ట్విటర్లో కోరారు.
*రాష్ట్రంలోని సాధారణ ప్రజల జీవనానికి భంగం కలిగించేలా కరోనా వైరస్ గురించి సామాజిక మాధ్యమాల్లో వదంతులను వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. కొవిడ్ 19 నివారణకు వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత వైరస్ వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం నిర్వహించే వ్యక్తులపై ఇప్పటికే నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలోనూ సమాచారాన్ని పోస్ట్ చేశారు.
*శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని రైతులకు తెరాస ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. హామీ ప్రకారం రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతుల అప్పును ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఇందుకు రూ.24 వేల కోట్లు వ్యయమవుతుందని, బడ్జెట్ సమావేశాల్లో రుణమాఫీకి నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం హన్మకొండలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రుణమాఫీ వల్ల 30 లక్షల మంది రైతులకు మేలు జరుగనుందన్నారు. అర్హతగల రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.
*మిషన్ భగీరథ తెలంగాణ ప్రజలకు వరదాయిని అని, ఈ పథకంలో పంపిణీ చేస్తున్న తాగునీరు ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని వరంగల్ ఎన్ఐటీ విశ్రాంత ఆచార్యుడు పాండురంగారావు నేతృత్వంలోని కమిటీ పేర్కొంది. మినరల్ వాటర్, ఆర్వో ప్లాంట్ల నీళ్లు ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని తెలిపింది. ఈ కమిటీ రూపొందించిన నివేదికను బుధవారం తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు అందజేసింది. మినరల్, ఆర్వో ప్లాంట్ల నీటిలో 100 పీపీఎం లోపు ఖనిజాలు (మినరల్స్) ఉండగా, మిషన్ భగీరథ నీటిలో 300 నుంచి 400 పీపీఎం ఖనిజాలు ఉన్నాయన్నారు.
*భారత వైమానిక దళంలో తెలంగాణ యువత భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు త్వరలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. వైమానిక దళంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం 0.8 శాతం మాత్రమే ఉందన్నారు. రక్షణ దళాలు అందించే ఉద్యోగావకాశాల గురించి యువతకు సరైన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. భారత నావికాదళం కెప్టెన్ శ్రీరామ్, వింగ్ కమాండర్ యోగేష్ మోహ్లా, ఇతర అధికారులతో సీఎస్ బుధవారమిక్కడ సమావేశమయ్యారు.
*రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పది రోజులపాటు కొనసాగిన పట్టణ ప్రగతి కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ‘పట్టణ ప్రగతి’ని మొత్తం 128 పురపాలికలు, 12 నగరపాలక సంస్థల పరిధిలో నిర్వహించారు. పట్టణవాసులకు మెరుగైన జీవన పరిస్థితులను కల్పించేందుకు పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు సహా పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులను సైతం గుర్తించారు
*ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 10న మొదలుకానుంది. పరీక్షలు ఈనెల 23న ముగుస్తాయి. మొదట తెలుగు, సంస్కృతం తదితర భాషా సబ్జెక్టుల మూల్యాంకనం చేస్తారు. ఇతర సబ్జెక్టుల మూల్యాంకనాన్ని 20 తర్వాత మొదలుపెట్టనున్నారు. గత ఏడాది ఫలితాల్లో తప్పులు దొర్లడంతో మూల్యాంకనంలో పాల్గొనే అధ్యాపకులకు ఒక రోజు ఇంటర్బోర్డులో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
*అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6న దుబాయ్లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహిళా సదస్సును కరోనా వల్ల తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్(ఐఆర్డీఏ) అధ్యక్షుడు పి.వినయ్కుమార్ తెలిపారు. కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
*రాజధాని ప్రాంతంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, అనేక గ్రామాల్లో ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర ప్రతినిధి బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు తెలిపింది. అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ ఉద్యమిస్తున్న రాజధాని ప్రాంత వాసులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం సీపీఐ రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం రాజ్భవన్లో గవర్నర్ను కలసి వినతిపత్రం సమర్పించింది.
*అటవీ హక్కుల పరిరక్షణ చట్టం(ఆర్వోఎఫ్ఆర్) కింద అర్హత ఉన్న ప్రతి గిరిజన కుటుంబానికి భూమి పట్టాలు అందించాలని ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్పశ్రీవాణి, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పట్టాల జారీలో అధికారులు నిర్లక్ష్యం వహించినా, సహకరించకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చెప్పారు. అటవీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయ సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. భూమిపై హక్కుల కోసం ఇప్పటివరకూ వచ్చిన వ్యక్తిగత, సామూహిక దరఖాస్తులపై విచారణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
*పేదలకు పంపిణీ చేసేందుకు ఇళ్లస్థలాల లేఅవుట్ పనులను రాజధాని గ్రామమైన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో బుధవారం ప్రారంభించారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, ఇతర అధికారులు దగ్గరుండి కంపచెట్లు తొలగించే పనులను పర్యవేక్షించారు. మంగళవారం సీఆర్డీఏ సీఈ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఇక్కడ పనులు ప్రారంభించేందుకు రాగా వారిని రైతులు అడ్డుకున్నారు. బుధవారం ప్రవీణ్ప్రకాష్ రంగంలోకి దిగి అధికారులతో పనులు మొదలు పెట్టించారు. దాదాపు 200 మంది పోలీసుల్ని మోహరించారు. కొద్ది మంది రైతులు, మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు.
*ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిబంధనలు-2020ను ఆమోదిస్తూ బుధవారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎంఈడీ, వ్యవసాయ, వైద్య కళాశాలలకు కన్వీనర్ కోటా కింద నిర్ణయించే బోధన రుసుముల కంటే రెండింతల రుసుములను యాజమాన్య కోటా కింద వసూలు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. కళాశాలల్లో డిజిటల్, జీవన నైపుణ్యాల అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి చెల్లించే వేతనాలపైన స్పష్టత ఇచ్చారు.
*రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వ్యవస్థ మెరుగుదలకు ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు రూ.300 కోట్లు అదనపు నిధుల మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆకర్షణీయ నగరం పథకం కింద కాకినాడ అభివృద్ధికి రూ.198 కోట్లు విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శ్యామలారావు బుధవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
*ఆంధ్రప్రదేశ్లో గనుల తవ్వకాల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో ఖర్చుచేయడానికి ఉద్దేశించిన నిధులు రూ.905.62 కోట్లు వసూలుకాగా, అందులో రూ.169.85 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు.డీఎంఎఫ్ కింద ఏపీకి 11,011 ప్రాజెక్టులు మంజూరుచేసినట్లు చెప్పారు.
*7, 8న లేపాక్షి వైభవం
విజయవాడ సబ్కలెక్టరేట్, న్యూస్టుడే: లేపాక్షి వైభవం పేరిట ఈనెల 7, 8 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా లేపాక్షిలోని ఏపీఆర్ బీసీ బాలుర పాఠశాలలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈసారి ఉత్సవాలకు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ ఆహార అలవాట్లు, సంస్కృతి తెలిపేలా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. సీమ అంటే ఫ్యాక్షనిజం కాదని, ఆ ప్రాంత వాసుల ఆదరాభిమానాలను చాటేలా వేడుకలు ఉంటాయన్నారు. 500 మందితో కర్ర సాము నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రెజిల్ దేశంలో నిర్వహించే కార్నివాల్ రీతిలో లేపాక్షి ఉత్సవాల్లో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో పర్యటక శాఖ ఎండీ ప్రవీణ్కుమార్, ప్రాంతీయ సంచాలకులు బి.ఈశ్వరయ్య పాల్గొన్నారు
*కేంద్రం నుంచి రావాల్సిన ధాన్యం బకాయిలు రూ.4,724 కోట్లతో పాటు పోలవరం నిర్మాణానికి, పునరావాసానికి నిధులు ఇప్పించడంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ కోరారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన ప్రాజెక్టులు, సంస్థల విషయంలోనూ శ్రద్ధ చూపి రాష్ట్రానికి మంచి జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
హైకోర్టుకు హాజరైన ఆంధ్రా డీజీపీ-తాజావార్తలు
Related tags :