Politics

కేశవరావుపై నమ్మకం ఉంచిన కేసీఆర్

KCR Picks Kesavarao And Suresh Reddy For Rajyasabha

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. టిఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేస్తారు.తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి అభినందించారు.