Health

వేసక్టమీ తర్వాత పిల్లలను కనవచ్చా?

Kids After Vaasectomy Surgery

వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాక.. మళ్లీ పిల్లల్ని కనొచ్చా.. పిల్లలు వద్దనుకుని వెసెక్టమీ చేయించుకునే మగవారు.. ఆ తర్వాత పిల్లలు కావాలనుకుంటే ఏం చేయాలి.. ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉంటుందా.. నిపుణులు ఏమంటున్నారు..పెళ్లాయ్యాక చాలా మంది దంపతులు పిల్లల్ని కంటారు. ఆ తర్వాత దంపతుల్లో ఆపరేషన్ చేయించుకుంటారు. మగవారు వెసెక్టమీ చేయించుకుంటారు. ఆ తర్వాత తిరిగి పిల్లలు కావాలనుకుంటే ఫలితం ఉంటుందా..

కొంతమంది మగవారు.. పిల్లలు పుట్టాక.. వెసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. ఇక పిల్లలు మళ్లీ కనొద్దనుకుంటారు. అయితే, అన్ని పరిస్థఇతులు ఒకలా ఉండవు.. పుట్టిన వారికి ఏవైనా సమస్యలు ఉండడం.. ఇతర కారణాల వల్ల మళ్లీ పిల్లలు కావాలనుకుంటారు. అప్పుడు వెసెక్టమీ ఆపరేషన్‌కి తిరిగి ఆపరేషన్ చేయించుకుని పిల్లల్ని కనొచ్చొ లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే, ఆ అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

*** పదేళ్లలోపే..

అయితే, ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే.. వెసెక్టమీ చేయించుకున్న తర్వాత పిల్లలు కావాలనుకుంటే పదేళ్లలోపు సర్జరీ చేయించుకోవాలి. లేకపోతే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

*** వయసు ముఖ్యమే..

అదే విధంగా.. తిరిగి ఆపరేషన్ చేయించుకున్నా కొన్ని ముఖ్య విషయాలు ఉంటాయి. అవేంటంటే.. దంపతుల ఇద్దరి వయసు కూడా తక్కువగానే ఉండాలి. ముఖ్యంగా ఆడవారి వయసు 30ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. దంపతులు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలి.

*** హార్మోన్ పరీక్ష అవసరం..

అదే విధంగా వేసెక్టమీ తర్వాత పిల్లలు కావాలనుకునేవారు.. ముందుగా హార్మోన్ పరీక్షలు చేయించుకోవాలి. అన్ని సరిగ్గా ఉంటే ఆ తర్వాత తిరిగి సర్జరీ చేయించుకుని పిల్లల్ని కనొచ్చు.

*** ఒకవేళ సమస్య ఉంటే..

అయితే, ఇలాంటి కేసుల్లో సమస్య గనుక ఉంటే ఐవీఎఫ్‌ని ఆశ్రయించొచ్చు. దీని వల్ల పిల్లల్ని కనొచ్చు. ఇలాంటి వారు ముందుగా వైద్యులను సంప్రదిస్తే.. వారు దంపతులు ఇద్దరిని పరీక్షించి తగిన విధమైన ట్రీట్‌మెంట్ ఇస్తారు.

అదే విధంగా మీ సమస్య ఏంటో ముందుగా వైద్యులకు తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల మీరు సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. దీని వల్ల అనుకున్న విధంగా మీరు పిల్లల్ని కనొచ్చు. అంతేకానీ, వెసెక్టమి జరిగింది కదా అని పిల్లలు పుట్టరు అని అనుకోవడం సరికాదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు కృషి చేయడం చాలా ముఖ్యం.

దంపతులు ఇద్దరి ఆరోగ్య పరిస్థితులు కూడా ముఖ్యమే. సరైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, డైట్ మెయింటెయిన్ చేయడం సరైన పోషకాహారం తీసుకోవడం ఇలాంటి అన్ని విషయాలు కూడా సంతాన విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. చాలా కేసుల్లో వేసెక్టమీ జరిగాక తిరిగి పిల్లల్ని కన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా మీరు ఇలాంటి విషయాల్లో వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఆరోగ్యం, అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు తిరిగి పిల్లల గురించి ప్రయత్నించొచ్చు. అయితే, ఏ విషయం అయినా ఆలస్యం చేయకపోవడమే మంచిది. దీని వల్ల రోజురోజుకి అవకాశాలు తగ్గిపోతాయనే విషయం గుర్తుపెట్టుకోవడం మంచిది.

Kids After Vaasectomy Surgery