రాజ్యసభ 250 సమావేశాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ 250 రూపాయల నాణాన్ని రాజ్యసభ సభ్యులకు పంపిణీ చేసింది. ఆ నాణాన్ని గురువారం రాజ్యసభలో సభ్యులకు అందజేశారు. ఈ నాణాన్ని రాజ్యసభ సభ్యులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నాణెం 10 గ్రాముల వెండితో తయారుచేయబడింది. ఈ నాణెంపై 250 డాట్స్, లైన్స్ ఉన్నాయి. అంతేకాకుండా నాణెంపై మహాత్మాగాంధీ బొమ్మ కూడా ముద్రించారు. ఈ నాణెం కేవలం రాజ్యసభ 250 సమావేశాలకు గుర్తుగా ముద్రించిందే తప్ప ప్రజల సౌకర్యార్థం కాదని రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
₹250 నాణెలు పంపిణీ చేసిన RBI
Related tags :