దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ యేడాది జరగాల్సిన ఐపిఎల్ నిర్వహణపై సందిగ్దత నెలకొంది. కరోనాను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దేశంలో ఎంతో ఆదరణ పొందిన ఐపిఎల్‌ను నిర్వహించలేమని ఇప్పకటికే కొన్ని రాష్ట్రాలు తేల్చి చెప్పాయి. ఈ మ్యాచ్ లను చూసేందుకు వేల సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి వచ్చే అవకాశం ఉంది.. ఇలా జరిగితే కరోనాను ఆపలేమని, కరోనా మరింత విజృంచొచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు ఐపీఎల్‌ని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇక, మహారాష్ట్ర ప్రభుత్వం అయితే టికెట్ల అమ్మకంపై ఏకంగా నిషేధం విధించింది.తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఐపీఎల్‌ని రద్దు చేసింది. స్పోర్ట్స్, మీటింగ్స్, కాన్ఫరెన్స్ కార్యక్రమాలన్నింటిన రద్దు చేస్తున్నట్టు హెల్త్ సెక్రటరీ పద్మిని సింగ్లా ప్రకటించారు. అలాగే విద్యాసంస్థలు, సినిమా హాళ్లను మార్చి 25 వరకు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.మరోవైపు విదేశాంగ శాఖ కూడా ఐపిఎల్‌లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లకు వీసాలు మంజూరు చేయడంపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపిఎల్ కొనసాగడం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, దీనిపై శనివారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శనివారం కేంద్ర ప్రభుత్వం, బిసిసిఐ ప్రతినిధుల మధ్య జరిగే భేటిలో ఐపిఎల్ భవితవ్యం తేలనుంది.
IPL రద్దు

Related tags :