హైపర్‌టెన్షన్, డయాబెటిస్, గుండెపోట్ల వంటి జీవనశైలి వ్యాధులకు ప్రధానమైన రిస్క్ కారకం అధిక బరువు/స్థూలకాయం. బిఎంఐ విలువల ద్వారా తగినంత బరువు ఉన్నామా.., జబ్బుల రిస్కుకి దగ్గరలో ఉన్నామా… అనేది తెలుసుకోవచ్చు. బిఎంఐ అంటే బేసల్ మెటబాలిక్ ఇండెక్స్. మనం ఎంత బరువుండాలి అనేది మన బిఎంఐ విలువల ఆధారంగా నిర్ణయిస్తారు. ఎత్తు, బరువుల నిష్పత్తి ఆధారంగా బిఎంఐ విలువలను గణిస్తారు. అదేవిధంగా మనం రోజుకి తీసుకోవాల్సిన కేలరీల కన్నా అదనంగా తీసుకున్నా, తగినంత వర్కవుట్ చేయకపోయినా ఈ అదనపు కేలరీల నిల్వ పెరిగిపోయి, బాడీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. బిఎంఐ కూడా పెరుగుతుంది. అందుకే రోజుకు ఎన్ని కేలరీలు తీసుకోవాలో తెలిస్తే మనం తీసుకునే కేలరీలు కూడా పరిమితి మించకుండా చూసుకోవచ్చు.
***బిఎంఐ.. విలువలు
బిఎంఐ విలువ 18.5 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటే – సాధారణం.
25 నుంచి 30 మధ్య ఉంటే – అధిక బరువు
30 నుంచి 35 మధ్య ఉంటే – స్థూలకాయం
35 కన్నా ఎక్కువ దాటితే – అతి స్థూలకాయం.
****ఎవరికి.. ఎన్ని కేలరీలు?
శారీరక శ్రమ లేని స్త్రీలకు సగటున రోజుకు 2000 కేలరీలు అవసరం.
శారీరక శ్రమ లేని పురుషులకైతే రోజుకు 2500 కేలరీలు అవసరం.
ఇంతకు మించి తీసుకుంటే అధిక బరువు, స్థూలకాయ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది.
BMI ఎంత ఉండాలి బ్రదరూ?
Related tags :