లాయర్లు మాత్రమే కోర్టు రూమ్‌లోకి రావాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.
కేవలం అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తామని కూడా సుప్రీం పేర్కొన్నది.
ఆయా కేసులకు సంబంధించిన లాయర్లు మాత్రమే కోర్టు రూమ్‌కు రావాలని, ఇతరులను అనుమతించమని కోర్టు చెప్పింది.
చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.