Politics

మళ్లీ పీఠం పుతిన్‌దే

Putin becomes president of russia again

రష్యా అధ్యక్ష పీఠంపై తానే కొనసాగాలనుకుంటున్న వ్లాదిమిర్‌ పుతిన్‌కు మార్గం సుగమమైంది. 2024 తర్వాత కూడా ఆయన మరో రెండు దఫాలు అధ్యక్ష పదవికి పోటీచేయడానికి వీలు కల్పించే రాజ్యాంగ సవరణకు రష్యా పార్లమెంటు బుధవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం 2024లో ముగిసే ప్రస్తుత పదవీకాలం తర్వాత కూడా 67 ఏళ్ల పుతిన్‌ మరో 12 ఏళ్లపాటు అధ్యక్ష పదవిలోనే కొనసాగేందుకు అవకాశాలున్నాయి.