DailyDose

₹13లక్షల కోట్లు హాంఫట్-వాణిజ్యం

Telugu Business News Roundup Today-13Lakh Crores Lost Due To Coorna

*ఊహించినట్లుగానే భారత స్టాక్ మార్కెట్ నిన్నటి పతనాన్ని కొనసాగించింది. క్రితం ముగిమ్పుకన్నా 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 9.20 గంటల సమయానికి 3090 పాయింట్లకు చేరుకోగా ఎస్ ఎస్ ఈ నిఫ్టి సైతం అదే దారిలో పయనిస్తూ కొనసాగుతోంది.
* కాసేపు నిలిచిన తర్వాత పునఃప్రారంభమైన దేశీయ మార్కెట్లు భారీ లాభాల్ని నమోదుచేస్తున్నాయి. ఓ దశలో 4500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో అత్యధిక రికవరీని రికార్డు చేసింది. ఉదయం 29,388 వరకు పడిపోయిన బీఎస్‌ఈ సూచీ తిరిగి 34,434 వరకు చేరింది. అటు నిఫ్టీ సైతం మూడు శాతం లాభాల్ని నమోదు చేసింది. 8,555 వద్ద కనిష్ఠ స్థాయికి చేరిన ఎన్‌ఎస్‌ఈ సూచీ 10,068 వరకు ఎగబాకింది. అటు రూపాయి సైతం బలపడింది. ఓ సమయంలో డాలరుతో మారకం విలువ రూ.74.50 వరకు పడిపోయిన రూపాయి.. ట్రేడింగ్‌ తిరిగి ప్రారంభమైన తర్వాత రూ. రూ.73.91 వరకు కోలుకుంది. ‘ఫియర్‌ గేజ్‌’గా పిలిచే వొలటాలిటీ ఇండెక్స్‌ కాస్త చల్లబడి భయాల్ని తొలగించింది. అయితే దీన్ని ఏమాత్రం సానుకూల పరిణామంగా పరిగణించలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారీ వొలటాలిటీ ‘ఓవర్‌సోల్డ్‌ జోన్‌’లో ఉన్నట్లు సూచిస్తుందని ఆనంద్‌ రతీ సెక్యూరిటీస్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ సుజన్‌ హజ్రా అభిప్రాయపడ్డారు. అందుకే కొనుగోళ్లు జరుగుతున్నాయని వివరించారు.
* మొబైల్‌‌ ఫోన్స్‌‌, ఫెర్టిలైజర్స్‌‌‌‌, మ్యాన్‌‌మేడ్‌‌ ఫ్యాబ్రిక్స్‌‌, గార్మెంట్స్‌‌పై జీఎస్టీని ప్రభుత్వం18 శాతానికి పెంచనుంది. ఈ నెల 14 న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ మీటింగ్‌‌లో జీఎస్టీ రేటు పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం మొబైల్‌‌ ఫోన్స్‌‌పై 12 శాతం జీఎస్టీని, కొన్ని కాంపోనెట్స్పై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు.
*ఆసియా మార్కెట్లు భారీ పతనం
వైరస్‌ ధాటికి ఆసియా మార్కెట్లు శుక్రవారం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. సురక్షితంగా భావించే బంగారం, బాండ్ల షేర్లూ నేలచూపులు చూస్తున్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు దాదాపు 7శాతం మేర కుంగాయి. న్యూజిలాండ్‌ సూచీలు చరిత్రలోనే అత్యధిక ఇంట్రాడే నష్టాల్ని నమోదు చేశాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 10 శాతం, కొరియా కోస్డాక్‌ 8 శాతం పడిపోవడంతో 20 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అమెరికా మార్కెట్లు భారీ స్థాయిలో పతనం కావడం ఆసియా మార్కెట్లపై భారీ ప్రభావం చూపాయి. అమెరికా డోజోన్స్‌ ఓ దశలో 10శాతం మేర నష్టపోయింది. 1987 నాటి బ్లాక్‌ మండే క్రాష్‌ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. అమెరికా మార్కెట్లోకి 1.5 ట్రిలియన్‌ డాలర్లు చొప్పించనున్నామని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో కాస్త కోలుకున్న మార్కెట్లు.. యూరప్‌ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో భారీగా పతనమయ్యాయి. ఎస్‌అండ్‌పీ 500 9.5శాతం పడిపోవడంతో కాసేపు ట్రేడింగ్‌ను నిలిపివేశారు.
*వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.43,960, విజయవాడలో రూ.42,900, విశాఖపట్నంలో రూ.45,030, ప్రొద్దుటూరులో రూ.43,000, చెన్నైలో రూ.43,650గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.41,910, విజయవాడలో రూ.39,800, విశాఖపట్నంలో రూ.41,420, ప్రొద్దుటూరులో రూ.39,810, చెన్నైలో రూ.41,570గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,400, విజయవాడలో రూ.46,800, విశాఖపట్నంలో రూ.46,660, ప్రొద్దుటూరులో రూ.46,500, చెన్నైలో రూ.48,900 వద్ద ముగిసింది…
*కరోనా వైరస్ భయాలతో మన దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య దాదాపు 25-30 శాతం వరకు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పాధే వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో ప్రారంభమైన వింగ్స్ ఇండియా 2020లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. విమాన ప్రయాణికులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, విదేశాల నుంచి వచ్చేవారిని కొన్ని రోజులపాటు క్వారంటీన్లో ఉంచడంవల్ల ప్రయాణాలు తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు.
*ఫ్రాన్స్కు చెందిన దహేర్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న టీబీఎం ఎయిర్క్రాఫ్ట్లు భారత్కు రానున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తొలి విమానాన్ని అందిస్తామని దేశంలో వీటిని మార్కెటింగ్ చేస్తున్న ఎస్ఆర్కే ఏవియాకాం సీఈఓ కెప్టెన్ సంజయ్ కుమార్ తెలిపారు. ఈ టర్బోప్రోప్ విమానాలు ఆరోగ్య అత్యవసరాల్లో అంబులెన్స్గానూ, మానవ అవయవాల రవాణా కోసం వినియోగించే వీలుందని పేర్కొన్నారు. దీని ధర 40 లక్షల డాలర్ల వరకూ (దాదాపు రూ.30 కోట్లు) ఉంటుందని వివరించారు. టీబీఎం 910, టీబీఎం 940 రకం విమానాల్లో హోం సేఫ్ అనే సరికొత్త సాంకేతికత తీసుకొస్తున్నట్లు తెలిపారు.
*నీటిమీద దిగే సీప్లేన్లను తయారు చేసే రెవిన్ ఏవియేషన్ హైదరాబాద్లో డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది ఏర్పాటయ్యే అవకాశం ఉందని సంస్థ సీఈఓ నిరంజన్ మదారి తెలిపారు. ఇందులో దాదాపు 50 మంది ఇంజినీర్లను నియమించుకునే అవకాశం ఉందని చెప్పారు. దీనికోసం 1.5 కోట్ల యూరోల వరకూ పెట్టుబడి పెట్టొచ్చని తెలిపారు.
*జనవరిలో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి పెరిగింది. గనులు, విద్యుదుత్పత్తి కార్యకలాపాలు పుంజుకోవడమే ఇందుకు కారణం. పారిశ్రామికోత్పత్తి వృద్ధిని పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా లెక్కిస్తారు. జనవరిలో ఇది 2 శాతంగా నమోదైంది. గత 6 నెలల్లోనే ఇది అత్యధికం. 2019 జులైలో నమోదైన 4.9 శాతం వృద్ధి తర్వాత.. అప్పటినుంచి పారిశ్రామికోత్పత్తిలో ఇంత వృద్ధి నమోదుకావడం ఇదే మొదటిసారి. 2019 జనవరిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 1.6 శాతంగా నమోదైంది.
*కరోనా వైరస్ దెబ్బకి అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు కూడా నేలచూపులు చూస్తున్న నేపథ్యంలో, జూన్లోగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 65 బేసిస్ పాయింట్ల మేర కీలకరేట్లను తగ్గించొచ్చని బ్రిటిష్ సంస్థ బార్క్లేస్ అంచనా వేస్తోంది. ఏప్రిల్లో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్షకు ముందే ఒకవిడత రేట్ల కోతను ప్రకటించవచ్చని భావిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే కాస్త ఎక్కువగా ఉన్నా, వృద్ధినే ఆర్బీఐ ప్రధానంగా భావించవచ్చని పేర్కొంది. అయితే ద్రవ్యలభ్యత మెరుగు పడనంత వరకు రేట్ల కోత వల్ల ప్రయోజనం పరిమితంగానే ఉండొచ్చని వివరించింది.
*కొవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం మన దేశంపై తక్కువగానే ఉండొచ్చని దిగ్గజ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఈఓలు) అభిప్రాయపడుతున్నారు. వీరు తమ విదేశీ ప్రయాణాలను పరిమితం చేసుకుంటుండగా, కొందరైతే రద్దు చేసుకుంటున్నారు. అలాగే ఉద్యోగులకు అవసరమైన నైతిక మద్దతు ఇస్తున్నారు. ఆయా కంపెనీలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై, భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావం తక్కువగానే ఉండొచ్చనే ఆశావాదంతో ఉన్నారు.
*ప్రైవేట్ రంగ బ్యాంకుల నుంచి డిపాజిట్లను వెనక్కి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలియజేసింది. యెస్ బ్యాంక్పై ఆర్బీఐ మారటోరియం విధించడం, ఆ తదుపరి పరిణామాల నేపథ్యంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోని డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేయాలని ప్రభుత్వ సంస్థలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఆర్బీఐ ఓ లేఖ రాసింది. ప్రైవేట్ రంగ బ్యాంకుల నుంచి ఒక్కసారిగా డిపాజిట్లు వెనక్కి తీసుకుంటే బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో వైపరీత్యాలకు దారితీస్తుందని భావిస్తున్నామని అందులో పేర్కొంది.
*ఆరు నెలల్లోనే తొలిసారి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. కూరగాయలు చౌక అవ్వడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో 6.58 శాతంగా నమోదైంది. అయితే ఇప్పటికీ ఇది ఆర్బీఐ నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ నియంత్రిత లక్ష్యం కంటే ఎక్కువే. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారంగా లెక్కిస్తారు. ఈ ఏడాది జనవరిలో ఇది 7.59 శాతంగా ఉండగా.. 2019 ఫిబ్రవరిలో 2.57 శాతంగా నమోదైంది.
*దేశీయ పర్యటక, ఆతిథ్య రంగానికి కరోనా రూపంలో భారీ కష్టం ఎదురయ్యింది. కరోనా వైరస్ తాకిడికి దాదాపు రూ.8,500 కోట్ల మేరకు ఈ పరిశ్రమ నష్టపోతోందని అంచనా. ఇతర దేశాల నుంచి పర్యటకులు రాకుండా వీసాలను తాత్కాలికంగా రద్దు చేయడం దీనికి ప్రధాన కారణం. దీనివల్ల హోటళ్లు, విమానయాన పరిశ్రమ, పర్యటక సంస్థల వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కరోనా వైరస్ను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన తర్వాత ఎంతోమంది పర్యటకులు హోటళ్లు, విమాన టికెట్ బుకింగ్లను రద్దు చేసుకుంటున్నారు.