హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ సోషల్ మీడియాలో తరచుగా తన బికినీ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. బీచ్‌లో, ఇతర అందమైన లొకేషన్లలో అందాలొలికిస్తున్న ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ బికినీ ఫొటోల గురించి లక్ష్మీరాయ్‌ని ప్రశ్నిస్తే… “నేను ఎక్కడికెళ్లినా మధుర జ్ఞాపకంగా ఉంటుందని సెల్ఫీలు తీసుకుంటా. ఈరోజుల్లో బికినీ అనేది చాలా కామన్. నేను పోస్ట్ చేస్తున్న బికినీ ఫొటోలు పబ్లిసిటీ కోసం కాదు. నన్ను బికినీలో చూడడం ఇష్టం లేకపోతే కళ్లు మూసుకోమని నెటిజన్లకు చెబుతాను”అని పేర్కొంది. మీ లవ్ ఎఫైర్స్ గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి కదా అని అడిగితే… “నా జీవితంలో జరిగిన విషయాలను దాచి పెట్టను. అలాగని పబ్లిక్‌గా చెప్పుకోను. అయితే నేను చాలా మందితో సన్నిహితంగా ఉన్న మాట నిజమే”అని చెప్పింది లక్ష్మీరాయ్. పెళ్లి గురించి, కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగితే తన భర్తను ఎంచుకోవడం పూర్తిగా తన ఛాయిసే అని చెప్పింది. తన కుటుంబ సభ్యులు ఓపెన్ మైండెడ్ అని… వాళ్లు పెళ్లి విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలియజేసింది ఈ బ్యూటీ.
బికినీ…కామన్
Related tags :