*డిల్లీలో సిఏఏ వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ హింసకు దారితీసి యాభై మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిదే. ఈ అల్లర్లను ఇంటలిజెన్స్ అధికారి అంకిత్ శర్మ ఓ మురుగు కాలవలో శవమై కనిపించారు. అంకిత్ శర్మ మృతి పై పోస్టు మార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
*శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చుట్టూ పక్కల ఇళ్లాల్లోని ఫర్నీచర్ ఇంటి అద్దాలు ద్వంసం అయ్యాయి. రైల్వే సమీపంలో ఉన్న కబెదాన్ వడ్డెర బస్తీలోనిచెత్తకుప్పలో ఈ పేలుడు సంభవించింది.
*జనసేన పార్టీ నాయకుడు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికే మధుమధన గుప్తాను బైండోవర్ చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యంలో రెవెన్యు పోలీసు అధికారులు ఈమేరకు చర్య తీసుకున్నారు గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ను ఆయన ద్వంసం చేసారు.
* అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం రామదాసు పేట సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా ఇద్ధరు మృతి ఇద్ధరికి త్రీవగాయాలు.
* కామారెడ్డి జిల్లాలోని బిక్కునూరు మండలం అనంతపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది.
*ప్రకాశంజిల్లాలోని వేటపాలెం మండలం రామన్నపేటలో ఎక్సైజ్ ఆధికారుల దాడులు చేశారు. ఓ ఇంటిపై దాడులు చేసిన ఆధికారులు గంజాయి విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు.
* అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం రామదాసు పేట సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా ఇద్ధరు మృతి ఇద్ధరికి త్రీవగాయాలు.
* పిడుగురాళ్ల మండలం 18 ఎంపీటీసీ లకు 18 ఎంపీటీసీ లు ycp ఏకగ్రీవం.పిడుగురాళ్ల,ycp జడ్పీటీసీ అభ్యర్థి జంగా వెంకట కోటయ్య ఏకగ్రీవం.గుంటూరు జిల్లా, దాచేపల్లి మొత్తము 12 ఎంపీటీసీ లకు వైస్సార్ సీపీ 8mptc లు ఏకగ్రీవం.గుంటూరు జిల్లా, మాచవరం మండలం 15 ఎంపీటీసీ లకు 6ఎంపీటీసీ లు ysr cp ఏకగ్రీవం…
*పాశర్లపూడి బ్రిడ్జిపై నుండి గోదావరిలోకి దూకి బివిసి కళాశాల విద్యార్థి గల్లంతైన ఘటన శనివారం తూర్పు గోదావరి మామిడికుదురు మండలంలో చోటు చేసుకుంది. ఉప్పలగుప్తం మండలం నంగవరానికి చెందిన మట్టపర్తి యశ్వంత్ సాయి వీరేంద్ర ఈరోజు ఉదయం పాశర్లపూడి బ్రిడ్జిపై నుండి గోదావరిలోకి దూకాడు. గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిరోజులుగా వీరేంద్ర మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో చదవుపై శ్రద్ధ చూపలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
*రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. జోధ్‌పూర్ జిల్లాలోని బాలోత్ర-పలోడీ హైవైపై ట్రక్కు మరియు బొలేరో వ్యాను ఢీకొన్నాయి. ట్రక్కు పూర్తిగా బొలేరో పైకి ఎక్కింది. దాంతో అందులో ప్రయాణిస్తున్నవారిలో 11 మంది ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
* సిర్పూర్ మండలంలో ని బండేయేర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతబాయి, యశ్వంత్‌రావు దంపతుల కుమార్తె ఆత్రం రేణుకబాయి (19) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్సై అశోక్ శుక్రవారం తెలిపారు.
*వాంకిడి నుంచి ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న రెండు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను పట్టుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రవి చంద్రకాలనీకి చెందిన కడమంచి రాజేందర్ ద్వి చక్ర వాహనంపై బియ్యం తరలిస్తుండగా పట్టు కున్నామన్నారు. ద్విచక్ర వాహనం, బియ్యంను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
*కాసిపే మండలంలోని పాత తిర్మాలాపూర్ నుంచి ఎడ్లబండిపై అక్రమంగా తరలిస్తున్న కలపను గురువారం రాత్రి బెల్లంపల్లి అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
*నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండ ల కేంద్రంలో అనుమతి లేకుండా అక్రమంగా లాక్కీ డ్రా నిర్వహి స్తున్న వ్యక్తిని పట్టుకొని నిర్వాహకు అడిచర్ల ప్రమోద్‌పై కేసు న మోదు చేసినట్టు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
*ఓ హెడ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుపతిలోని దోబి కాలనీ శ్మశానంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడు బీఎస్ఎప్ హెడ్ కానిస్టేబుల్ సిద్దరాముగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*నామక్కల్లో వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు బిహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
*శనివారం మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అగి ఉన్న ట్రైన్‌కు చెందిన రెండు కోచ్‌లకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో ఆర్పారు. ఈ ప్రమాదంలో ఒక బోగి దాదాపు మంటల్లో కాలిపోయింది. మరో బోగీకి మంటలు వ్యాపించేలోపే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలకు కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చేటుచేసుకుంది.
* తమిళనాడులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్ వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులను బీహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
*మెడలోని తాళిబొట్టు బిగుసుకుపోయి ఊపిరాడక ఒక మహిళ మృతి చెందిన వైనమిది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కనుకుంట్ల ఎల్లమ్మ (50) అనే మహిళ గ్రామంలోని రెండో అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పని చేస్తోంది.
*డేటింగ్యాప్లో యువతుల చిత్రాలుంచటం.. కోరిన వారికి అశ్లీల చిత్రాలు పంపటం.. ఇదే డబ్బు సంపాదనకు మార్గంగా ఎంచుకున్న ఛార్టెడ్ అకౌంటెంట్ విద్యార్థి ఒకరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
*మహారాష్ట్ర సిందెవాహి తాలూకా నాలేశ్వర్(మోహాడి) గ్రామానికి చెందిన మాణిక్ నన్నావరే(52) తన పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లి వస్తుండగా పులి దాడి చేసింది. రాత్రి పొద్దుపోయినా మాణిక్ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. చివరకు ఆయన మృతదేహం వారి కంటపడింది.
*ఇంజిన్లో విద్యుత్తు తీగల రాపిడితో మంటలు చెలరేగి ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. ఈ ఘటన సంగారెడ్డి మండలం రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును రామచంద్రాపురం నాగుళ్లమ్మ ఆలయం వద్ద ప్రయాణికురాలిని దింపడానికి ఆపారు. అప్పుడే ఇంజిన్లో మంటలు వచ్చి.. కొద్దిసేపటిలోనే బస్సు నిండా దట్టమైన పొగ ఆవరించింది.
*బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.పది వేల జరిమానా విధిస్తూ విజయవాడలోని జిల్లా ప్రత్యేక పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి ప్రతిభాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన కుంపటి బాల ప్రదీప్(21) స్థానికంగా ఆటో నడుపుతుండేవాడు
*బాలికకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని తిరువారూర్లో చోటు చేసుకుంది. ఏకంగా నాలుగు నెలలుగా ఈ దారుణం కొనసాగుతోంది. బాధితురాలు గర్భం దాల్చడంతో ఘోరం వెలుగుచూసింది.
*శుభకార్యం ముంగిట ఆ ఇంట్లో విషాదం నిండింది. తెలిసినవారే కదా పలకరిస్తే ఏమౌతుందిలే అనుకున్నారు కానీ, ఘోర ప్రమాదానికి దారితీస్తుందని ఊహించలేకపోయారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం వివరాల్ని సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లికి చెందిన జియ్య సుమన్(19) అక్క పెళ్లి రెండు రోజుల్లో ఉంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో చదువుకుంటున్న మేనత్త రాజవ్వ(36) కుమార్తె (దుర్గావేణి 12)ను తీసుకురావడానికి ద్విచక్రవాహనంపై సుమన్ వెళ్లాడు. ఆయన వెంట రాజవ్వ కూడా ఉంది. ముగ్గురు కలిసి మెంట్రాజ్పల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి వద్దకు రాగానే తెలిసినవారు మరో ద్విచక్రవాహనంపై కనిపించారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ద్విచక్రవాహనాల్లో సమాంతరంగా వస్తుండగా అవి ఢీకొన్నాయి.
*హీరో గోల్డ్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. ఎస్ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్ యజమాని సయ్యద్ అక్తర్ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా నౌహీరా షేక్ ఖాతాల నుంచి అక్తర్కు రూ.50 కోట్లు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో హీరాగోల్డ్ కేసులో మరిన్ని సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
*సామాజిక మాధ్యమంలో పరిచయమైన పాతబస్తీ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడిన గుల్బర్గా యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
*చిన్న ఇనుప రాడ్డుతో చాకచక్యంగా ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్లో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు.
*దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో దిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో కులదీప్ సెంగార్తో పాటు మరో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. సెంగార్తో పాటు ఆయన సోదరుడు అతుల్ సెంగార్ను రూ.10లక్షలు చొప్పున బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని న్యాయమూర్తి ధర్మేష్ శర్మ ఆదేశించారు.
హైదరాబాద్…రైల్వేస్టేషన్ వద్ద భారీ పేలుడు-నేరవార్తలు
Related tags :