NRI-NRT

దక్షిణాఫ్రికాలో కవిత జన్మదిన వేడుకలు

SouthAfrica Telugu NRI NRT-MP Kalvakuntla Kavitha Birthday In South Africa

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా శాఖ అంగరంగవైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సభ్యులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. తండ్రికి తగ్గ తనయురాలు కవిత అని కొనియాడారు. చెరగని చిరునవ్వు, ఆత్మవిశ్వాసం, మాట ఇస్తే తప్పని నైజం ఆమె సొంతమన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ఎంపీగా ఎన్నికైన కవిత.. ఉత్తమ పార్లమెంటీరియన్‌ అవార్డు సైతం సొంతం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి ఏర్పాటుచేసి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తెలంగాణ మలిదశ ఉద్యమంలో మహిళా నేతగా కీలక భూమిక పోషించారని ఆయన తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితదని నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా శాఖను పటిష్టపరచడంలో కీలకపాత్ర వహిస్తున్న జ్యోతిరెడ్డి వాసిరెడ్డి, కట్టా శిరీషలను శాఖ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ శాఖ ఉపాధ్యక్షులు నన్నూరి మల్లికార్జున్‌ రెడ్డి, కొశాధికారి హరీష్‌ రంగా, మీడియా ఇంచార్జీ కిరణ్‌ కుమార్‌ బెల్లి, ఉమ్మడి కార్యదర్శులు జ్యోతిరెడ్డి వాసిరెడ్డి, రమణా రెడ్డి కంకణాల, కార్యనిర్వాహకులు సౌజన్‌ రావు, సాయికిరణ్‌, అనిల్‌ రెడ్డి గుడిపాటి, చక్రపాణి, వెల్ఫేర్‌ ఇంచార్జి శివా రెడ్డి, పీఆర్‌ఓ రాంబాబు తొడుపునూరి, కల్చరల్‌ ఇంచార్జి నవదీప్‌ రెడ్డి, చారిటీ ఇంచార్జులు శ్రీధర్‌ రెడ్డి, అరవింద్‌, మెంబర్‌షిప్‌ ఇంచార్జులు నామా రాజేష్‌, సందీప్‌ ముషిపట్ల, కోర్‌ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌ రేపల, శిరీష కట్టా, రంజిత్‌ పాల్గొన్నారు.