DailyDose

తెలంగాణాలో ఈ నెలాఖరు వరకు అన్నీ బంద్-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Telangana Lock Down

* తెలంగాణాలో అన్ని విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లకు ఈనెల 31 వరకు సెలవులు
*న్యూడిల్లీలో శనివారం నాడు ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం కురిసింది .ట్రాఫిక్ స్తంభింది.
*మంచిర్యాలలో ఒక యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రజలు భయప్రంతులయ్యారు.
*గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలంలో వైకాపా తరపున మొత్తం ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవటం కలకలం సృష్టిస్తుంది.
*న్యూడిల్లీలో ఈరోజు ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
* వారాంతాల్లో విజయవాడ విడిచి వెళ్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. కొందరు సీనియర్లు హైదరాబాద్‌, దిల్లీలో నివాసం ఉండటంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. అధికారిక కార్యక్రమాలకు మినహా ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం మెమో జారీ చేశారు. కొందరు అధికారులు సచివాలయానికి సైతం హాజరు కాకపోవడంతో పాటు క్యాంపు కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తుండటంపై సీఎస్‌ అసహనం వ్యక్తంచేశారు.
*మాస్క్లు, ఇతర వైద్య పరికరాలను తమ దేశానికి ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. ఈ మేరకు మోదీకి.. బెంజిమన్ ఫోన్ చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
*ఉగాదికి ప్రభుత్వం చేపట్టాల్సిన ఇళ్ల స్థలాల పంపిణీ నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. హైకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఓటర్లను ప్రలోభపెట్టే వ్యక్తిగత లబ్ధి కార్యక్రమాలను నిలుపుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
*రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య తగ్గడం, రెసిడెన్షియల్‌‌ స్కూళ్లు పెరగడంతో ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ అప్లికేషన్లు తగ్గాయని, అందువల్లే బడ్జెట్‌‌లో కేటాయింపులు తగ్గించామని ఆర్థిక మంత్రి హరీశ్రావు చెప్పారు.
*హరితహారం చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ శాఖ స్వరూపాన్నే మర్చేశామని చెప్పారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. పల్లె ప్రగతి నిరంతర కార్యక్రమమన్నారు. గతంలో ఆదర్శ గ్రామం అంటే వరంగల్‌‌ జిల్లా గంగాదేవిపల్లి గుర్తొచ్చేదని.. ఇప్పుడు ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. శుక్రవారం శాసనమండలిలో పల్లె ప్రగతిపై షార్ట్ డిస్కషన్‌‌ జరిగింది. బీజేపీ నేత రాంచందర్‌‌రావు, టీఆర్‌‌ఎస్‌‌ సభ్యుడు కర్నె ప్రభాకర్‌‌, గంగాధర్‌‌గౌడ్‌‌, కాంగ్రెస్‌‌ సభ్యుడు జీవన్‌‌రెడ్డి, ఎంఐఎం మెంబర్ జాఫ్రీ మాట్లాడారు.
*ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేస్తుంది రాజస్థాన్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ లిమిటెడ్‌ (REIL).. ఇందుకు గాను ఓ ప్రకటన చేసింది. ఏపీ రెన్యువబుల్ ఎనర్జీ కార్పొరేషన్ REIL సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ మొత్తంలో 32 చోట్ల చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
*శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని బైదలాపురం గ్రామానికి సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువపై ఉన్న పురాతన వంతెన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ వంతెనను 1974లో నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. వంతెనపై నుంచి తరచూ గ్రానైట్‌ రాళ్లతో భారీ వాహనాలు రాకపోకలు చేయడమే వంతెన కూలడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంతెన కూలడంతో బైదలాపురం గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నెల 21న ఎంపీటీసీ, 29న సర్పంచి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికారులకు అటు ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న వంశధార అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు
*పెట్రోల్‌, డీజిల్‌పై లీట‌రుకు మూడు రూపాయాల చొప్పున ఎక్సైజ్ సుంకాన్నికేంద్ర ప్ర‌భుత్వం పెంచింది. అంత‌ర్జాతీయంగా ఇంధ‌న ధ‌ర‌లు ప‌డిపోవ‌డంతో.. ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. లీట‌రు పెట్రోల్‌పై ప్ర‌త్యేక సుంకాన్ని రూ.2 నుంచి రూ.8 వ‌ర‌కు, డీజిల్‌పై నాలుగు రూపాయ‌ల‌ను పెంచారు. పెట్రోల్‌పై రోడ్డు సుంకాన్ని కూడా లీట‌రుకు రూపాయి, డీజిల్‌పై ప‌ది రూపాయ‌ల‌కు పెంచారు.
ఎక్సైజ్ సుంకాన్ని పెంచ‌డం వ‌ల్ల సాధార‌ణంగా ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతాయి. అయితే అంత‌ర్జాతీయ ధ‌ర‌లు త‌గ్గ‌డం వ‌ల్ల‌.. వినియోగ‌దారుల‌పై ఆ ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు లేవు.
*గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంతాళ్లాయపాలెం జంక్షన్ వద్ద 6వ రోజుకు చేరిన పరిపాలన వికేంద్రీకరణ దీక్షప్రజా ప్రతినిధులపై దాడులకు నిరసన దీక్షలో పాల్గొంటున్న వైసీపీ దళితులు,దళిత బహుజన సంఘాలుపరిపాలన వికేంద్రీకరణతోనే ఎస్సి,ఎస్టీ,బీసీల అభివృద్ధి అనే నినాదంతో దీక్ష చేస్తున్న దళితులు
*ఈనెల 15న పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్‌ జారీ కానుంది. రెండో దశ 17న జారీ చేస్తారు. తొలి దశ ఎన్నికలకు 17 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న పరిశీలిస్తారు. 21న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇస్తారు. 22న ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 27న పోలింగ్‌ ఉంటుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
*ఈ సంవత్సరం (2020) అమర్‌నాథ్‌ యాత్రను కిందటేడాదికంటే రెండు రోజులు ఎక్కువగా మొత్తం 42 రోజులపాటు నిర్వహించనున్నట్టు శ్రీఅమర్‌నాథ్‌ దేవస్థాన బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బిపుల్‌ పాఠక్‌ ఇటీవల ప్రకటించారు
*పదవి కోసం తన స్కూటర్‌ను తానే తగులబెట్టుకొని నాటకమాడిన హిందు మున్నని నేత సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
తిరుచ్చి అదవత్తూర్‌కు చెందిన శక్తివేల్‌ (32) హిందూ మున్నని మణికండం శాఖా కార్యదర్శిగా వ్యవహరిస్తూ, రియల్‌ఎస్టేట్‌, భవన నిర్మాణ కాంట్రాక్ట్‌లను చేపడుతుంటాడు. అతని ఇంటి ప్రాంగణంలో నిలిపివుంచిన ద్విచక్రవాహనం రెండ్రోజుల కిత్రం దగ్ధమైంది.
ఈ ఘటనపై శక్తివేల్‌ సోమరసంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
*తిరువళ్లూర్‌ జిల్లా పొన్నేరిలో రూ.1కే చికెన్‌ బిర్యానీ అందించే హోటల్‌ వద్ద ప్రజలు బారులు తీరగా, అ వాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీ సులు విధులు చేపట్టారు.
*గురువారం నుంచి ఉత్తర ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో 28 మంది మృతి చెందారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గోడలు కూలడం, చెట్లు పడిపోవడం, పిడుగులు పడటం వంటి కారణాల వల్ల వీరంతా మృతి చెందినట్లు తెలిపారు. పిలిబిత్‌, సీతాపూర్‌, చాందౌలీ, ముజాఫర్‌నగర్‌, భాగ్‌పట్‌, బిజ్‌నోర్‌, ఔన్‌పూర్‌ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది.
*అమరావతి రాజధాని కోసం రైతులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. ప్రతీ రోజు వివిధ రీతుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రస్తుతం రాజధాని రైతుల ఆందోళనలు 88వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నా….వెలగపూడిలో 88వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి. అలాగే పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి రాయపూడి, నేలపాడు, దపరిమి తాడికొండ అడ్డరోడ్డు,14వ మైలులో రైతుల ధర్నాలు చేపడుతున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి
*కోరలు చాస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం మినీ ఎమెర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం, ఏపీలో తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా నియంత్రణకు కేంద్రం సూచనల మేరకు బ్రిటిష్‌ కాలంనాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
*స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న సిబ్బంది కరోనా భయంతో తమకు మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల విధుల శిక్షణ సందర్భంగా వీరు తమ భయాలు, ఆందోళనలను ఏకరువు పెడుతుండటంతో రిటర్నింగ్‌ అధికారులు విషయాన్ని జిల్లా ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
*జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శని, ఆదివారాల్లో రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారని తెలిపారు. 14న పార్టీ ఆవిర్భావ సమావేశం నిర్వహించి ఆరేళ్లలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద ‘మన నది – మన నుడి’ కార్యక్రమంలో భాగంగా గోదావరికి హారతి ఇచ్చి రచ్చబండ నిర్వహిస్తారన్నారు
*హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల విచారణకు ఏకరూప పద్ధతి/ప్రామాణిక పద్ధతిని పేర్కొంటూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుతో పాటు మైనర్‌ పిల్లల అపహరణకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇచ్చిన సూచనల ఆధారంగా ఈ విచారణ పద్ధతిని రూపొందించినట్లు జీవోలో పేర్కొన్నారు.
*ఏపీ రెన్యువబుల్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 32 చోట్ల చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి.
*రాష్ట్రంలో ఎలక్ర్టిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు రాజస్థాన్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. ఏపీ రెన్యువబుల్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
*ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్‌ మెయిన్‌ (ఆన్‌లైన్‌) పరీక్ష షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 17 నుంచి 19 వరకు జరుగుతుందని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 17న ఉ.9.30 నుంచి 11.10 గం. వరకు జనరల్‌ ఇంగ్లీషు, జనరల్‌ తెలుగు (ఈ రెండూ విడివిడిగా క్వాలిఫై కావాలి), సా.3 నుంచి 5.30 గం. వరకు పేపర్‌-1 జనరల్‌ స్టడీ్‌స-మెంటల్‌ ఎబిలీటీ, 18న ఉ.9.30 నుంచి 12 గం. వరకు పేపర్‌-2 మ్యాథ్స్‌, సా.3 నుంచి 5.30 గం. వరకు పేపర్‌-3 జనరల్‌ ఫారెస్ట్రీ-1, 19న ఉ.9.30 నుంచి 12గం.వరకు పేపర్‌-4 జనరల్‌ ఫారెస్ట్రీ పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
*వాల్తేరు డివిజన్లో పలు రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేశారు. కొన్ని భద్రతా పరమైన పనుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.రద్దయిన వాటి వివరాలు…ఈనెల 15న విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ఈనెల 14, 21, 28న దుర్గ్-విశాఖ ప్యాసింజర్ఈ నెల 20, 27న వెళ్లాల్సిన విశాఖ-దుర్గ్ ప్యాసింజర్ఈనెల 15, 22, 29న బ్రహ్మపూర్-విశాఖ-బ్రహ్మపూర్ ప్యాసింజర్ఈనెల 15, 22, 29న పూరి-గుణుపూర్-పూరి, పలాస-గుణుపూర్-పలాస ప్యాసింజర్లుఈనెల 15, 22, 29న భువనేశ్వర్-విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
*ఉద్యోగులు కార్యాలయంలో పనిచేసే సమయంలో అందరికీ ఒకే తరహా ఉష్ణోగ్రతలు సరిపడవు. వ్యక్తిగతంగా ఎవరికి అవసరమైన ఉష్ణోగ్రతను వారికి అందించగలిగితే వారు సౌకర్యవంతంగా పని చేసుకోగలరు.
*ఉద్యోగులు కార్యాలయంలో పనిచేసే సమయంలో అందరికీ ఒకే తరహా ఉష్ణోగ్రతలు సరిపడవు. వ్యక్తిగతంగా ఎవరికి అవసరమైన ఉష్ణోగ్రతను వారికి అందించగలిగితే వారు సౌకర్యవంతంగా పని చేసుకోగలరు. విద్యుత్తు ఆదా అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో వ్యక్తిగత
*తమిళనాడు దక్షిణ ప్రాంతం నుంచి కర్ణాటక వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. తెలంగాణలో శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. గాలిలో తేమ హైదరాబాద్లో సాధారణం కన్నా 30 శాతం అదనంగా ఉంటోంది.
*ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు అమలు చేయని నాలుగు థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో తెలిపారు. శుక్రవారం లోక్సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నందుకు ఈ ఏడాది జనవరి 31 వరకు దేశవ్యాప్తంగా 14 థర్మల్ కేంద్రాల్లోని 31 యూనిట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.
*రాష్ట్రంలో పిగ్ బ్రీడింగ్ పాలసీని రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కెనడాకు చెందిన పోలార్ జెనెటిక్స్ అధ్యక్షుడు అల్ఫ్రెడ్వాల్, తెలంగాణకు చెందిన సౌజన్య ఫార్మ్స్ అధినేత సాగర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను కోరారు.
*విజయ పాడి సొసైటీల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలవారీగా డెయిరీలో సభ్యత్వం కలిగి ఉండి విజయకు పాలుపోయని రైతుల సమాచారం తెప్పించాలని.. అవసరమైతే వారి సభ్యత్వాల రద్దుకు వెనకాడొద్దని స్పష్టంచేశారు.
*ఆధునిక సాంకేతిక నైపుణ్యం ద్వారా ప్రజలకు మరిన్ని ఆరోగ్యసేవలను అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రవాణా సౌకర్యం లేని మారుమూల గిరిజన గూడేలు, తండాలు, గ్రామాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలను పంపిణీ చేయాలని భావిస్తోంది. దీని కోసం అంతర్జాతీయ, భారతీయ సంస్థలను భావ వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్టు) టెండర్లు ఆహ్వానించనుంది. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం బేగంపేట విమానాశ్రయం వద్ద దీనికి భావవ్యక్తీకరణ ప్రతిపాదనలను విడుదల చేయనున్నారు.
*ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వ్యాధిపై శనివారం రాష్ట్ర శాసనసభ, మండలిలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు సభల్లో వేర్వేరుగా స్వల్పకాలిక చర్చలు జరుగనున్నాయి. శాసనసభలో జరిగే చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడనున్నారు. మండలిలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రసంగించే అవకాశం ఉంది.
*కేంద్ర బడ్జెట్లో సామాజిక న్యాయ శాఖకు నిధులు పెంచాలని తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. బడ్జెట్లో సామాజిక న్యాయం, సాధికారిత శాఖ పద్దులపై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
*గరిష్ఠంగా నెల రోజులు, రూ.200 జరిమానా విధించతగ్గ ఈ కేసు.. విచారణలోనే శిక్షాకాలం పూర్తయ్యేలా ఉందని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. చట్టవిరుద్ధంగా డ్రోన్ వినియోగించినందుకు నార్సింగ్ పోలీసులు పెట్టిన కేసులో ఎఫ్ఐఆర్ను, రిమాండ్కు పంపుతూ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని, బెయిలు మంజూరు చేయాలంటూ రేవంత్రెడ్డి హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
*కెనడాలోని పోలార్ జెనెటిక్స్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్ వాల్ శుక్రవారం శాసనసభ, మండలి ప్రాంగణానికి రావడం రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దృష్టిని ఆకర్షించింది. ఆయన పందుల పెంపకం (పిగ్ బ్రీడింగు) విధానం గురించి ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావుతో చర్చించారు. సాదాసీదాగా వచ్చిన ఆయన అరగంట తర్వాత ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు ఆల్ఫ్రెడ్ వాల్ మంత్రుల నివాసంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని కలిసినట్లు తెలిసింది
*వేతనాల సవరణ, పాత పింఛను విధానం పునరుద్ధరణ సహా ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో ఉద్రిక్తతకు దారితీసింది. వందల మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసే సందర్భంగా ఇందిరాపార్కు చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
*నెల్లూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలోనూ భిన్న పరిస్థితులే నెలకొన్నాయి. జిల్లాలో మొత్తం 946 గ్రామ పంచాయతీలకు అధికారులు రిజర్వేషన్లను పూర్తి చేశారు. వీటిలో 941 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎస్టీలకు 106, ఎస్సీలకు 253, జనరల్కు 480 స్థానాలను కేటాయించారు. బీసీలకు 107 సీట్లే ఇచ్చారు.
*ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(బిజినెస్ ఆపరేషన్స్)గా గౌరీ శంకర్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది.
*ఇంటర్మీడియట్ పరీక్షలు, స్పాట్ మూల్యంకనం కొనసాగుతున్నందున పరీక్షలతో సంబంధం ఉన్న అధికారులను ఎన్నికల విధుల నుంచిమినహాయింపునివ్వాలంటూ జిల్లా కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి లేఖలు రాశారు.
*పుస్తకం ముద్రిత ధర కంటే అధికంగా సొమ్ము వసూలు చేసిన అమెజాన్ సంస్థపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం-2 ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్కు చెందిన ఖాజా హమీద్ హుస్సేన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించిన, ‘టార్జుమన్ ఉల్ ఖురాన్’ (ఆంగ్లంలోకి తర్జుమా) పుస్తకాన్ని అమెజాన్లో కొనుగోలు చేశారు. ఆన్లైన్ పోర్టల్లో పేర్కొన్న ప్రకారం రూ.2,715 చెల్లించారు.
*అక్రమ అరెస్టు లను వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్రభుత్వాసుపత్రి నుంచి గాంధీచౌక్‌ వరకు ఆశావర్కర్లు నిరసన ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు స్వరూప మాట్లాడుతూ గురువా రం హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్యశాక డైరెక్టర్‌ వద్ద శాంతియుతంగా తమ న్యాయమైన డిమాండ్లను పరి ష్కరించాలని కోరారు.
* పిడుగురాళ్ల మండలం 18 ఎంపీటీసీ లకు 18 ఎంపీటీసీ లు ycp ఏకగ్రీవం.పిడుగురాళ్ల,ycp జడ్పీటీసీ అభ్యర్థి జంగా వెంకట కోటయ్య ఏకగ్రీవంగుంటూరు జిల్లా, దాచేపల్లి మొత్తము 12 ఎంపీటీసీ లకు వైస్సార్ సీపీ 8mptc లు ఏకగ్రీవం.గుంటూరు జిల్లా, మాచవరం మండలం 15 ఎంపీటీసీ లకు 6ఎంపీటీసీ లు ysr cp ఏకగ్రీవం