DailyDose

సెల్‌ఫోన్ వినియోగదారులకు 18శాతం GST-వాణిజ్యం

Telugu Business News Roundup Today-GST For Mobile Users Increased To 18Percent

* మొబైల్‌ ఫోన్ కొనుగోలుదారులకు బ్యాడ్‌న్యూస్‌. మొబైల్‌ ఫోన్లపై గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ)ని 12శాతం నుంచి 18శాతానికి పెంచుతూ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌ ధరలో మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
* మూలధన సంక్షోభం పడిన యస్‌బ్యాంకునకు పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ఆర్‌బీఐ ప్రతిపాదించిన పునరుద్ధరణ ప్రణాళికను కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. అంతేకాదు బ్యాంకునకు అందించే అధీకృత మూలధనాన్ని రూ. 6200 కోట్లకు పెంచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ప్రభుత్వ బ్యాంకుఎస్‌బీఐ 49 శాతం ఈక్విటీ కొనుగోలు ద్వారా రూ.7250 కోట్ల నిధులను యస్‌ బ్యాంకునకు అందించనుంది. దీంతో యస్‌ బ్యాంకులో పెట్టుబడులకు దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు వరుసగా క్యూ కడుతున్నాయి.
*మీకు కారుందా? లేదంటే స్కూటర్ బైక్ వంటివి ఉన్నాయా అయితే మీకో షాకింగ్ న్యూస్ మోడీ సర్క్ర్ వాహనదారులకు ఝులాక్ ఇచ్చింది. అదేంటి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి కదా.. పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తాయి కదా అని అలోచిస్తున్నరేమో. ధరలు తగ్గుదల దేవుడెరుగు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల పై ఎక్సైజ్ సుంకం పెంచింది.
*మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌ లావాదేవీలు బంద్‌!
మీకు డెబిట్‌/క్రెడిట్‌ కార్డులున్నాయా? వాటితో మీరు ఆన్‌లైన్‌లో ఏమైనా లావాదేవీలు చేస్తున్నారా? మార్చి 16 నుంచి అది కుదరకపోవచ్చు! ఎందుకంటే మీ డెబిట్‌/క్రెడిట్‌ కార్డులను మరింత సురక్షితంగా మార్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) పటిష్ఠ చర్యలు చేపట్టింది. అనుచితంగా కార్డులను వాడటం, బ్యాంకింగ్‌ మోసాలను అడ్డుకొనేందుకు అన్ని బ్యాంకులకు కొన్ని నిబంధనలను జారీ చేసింది.
*అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరల ప్రయోజనాల్ని వినియోగదారుడికి చేరకముందే కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది.
*కరోనా వైరస్ (కొవిడ్ 19) మేఘాలు చుట్టుముట్టడంతో విమానయాన రంగం విలవిల లాడుతోంది. గిరాకీ గణనీయంగా తగ్గడంతో ముడిచమురు ధరలు క్షీణించడం ఈ రంగానికి మేలు చేసే అంశం కాగా, ఆసియా-ఐరోపా-అమెరికా దేశాల మధ్య విమానాలు, ప్రయాణికుల రాకపోకలపై ఆయా ప్రాంతాల వారీగా విధిస్తున్న ఆంక్షల వల్ల సంస్థలకు ఆదాయాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.
*ఎగుమతిదార్లకు పన్నులు, సుంకాలు తిరిగి చెల్లించే (రీఇంబర్స్) పథకానికి కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. పన్నులు, సుంకాలను గతంలో వీరికి ఇలా ఎప్పుడూ తిరిగి చెల్లించలేదు. తాజా నిర్ణయం వల్ల దేశం నుంచి ఎగుమతుల వృద్ధికి ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. విద్యుత్తు ఛార్జీలపై సుంకాలు, రవాణాలో వినియోగించిన ఇంధనంపై చెల్లించిన విలువ జతచేరిన సుంకం (వ్యాట్), వ్యవసాయం, సొంత అవసరాల కోసం విద్యుదుత్పత్తి, మండి ట్యాక్స్, ఎగుమతి పత్రాలపై చెల్లించిన స్టాంప్డ్యూటీ, విద్యుదుత్పత్తికి వినియోగించిన బొగ్గుపై సీజీఎస్టీ, పరిహారసుంకం, రవాణాలో వాడిన ఇంధనంపై కేంద్ర ఎక్సైజ్ సుంకం వంటివి తిరిగి ఎగుమతిదార్లకు జమచేస్తామని వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
*సంక్షోభంలో చిక్కుకున్న యెస్ బ్యాంకును గట్టెక్కించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐలు చకచకా చర్యలు చేపడుతున్నాయి. మారటోరియం విధించిన వెంటనే పునరుద్ధరణ ప్రణాళికను ఆర్బీఐ రూపొందించగా.. ఆ ప్రణాళికను శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
*దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణికులకు తగ్గట్టుగా విమానాశ్రయాల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఛైర్మన్ అర్వింద్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయ విమానాశ్రయాలు ఏడాదికి 34.5కోట్ల ప్రయాణికుల సామర్థ్యాన్ని తట్టుకునేలా ఉన్నాయని, 2030 నాటికి దాదాపు 70 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చాల్సి ఉంటుందని వివరించారు.
*కరోనా వైరస్ ప్రభావంతో చైనా, ఆసియా ఫసిఫిక్ దేశాల్లో సగానికి పైగా విమానాలు తగ్గిపోయాని బోయింగ్ ఉపాధ్యక్షుడు, మార్కెటింగ్ అధిపతి డారెన్ హాల్ట్ పేర్కొన్నారు. చైనా నుంచి ప్రతి రోజూ దాదాపు 15,000 విమాన సర్వీసులు వేర్వేరు గమ్యస్థానాలకు వెళ్లేవని, ఇప్పుడు అది 3,000లకు తగ్గిపోయిందని తెలిపారు
*సారస్ ఎంకే2 ఎయిర్క్రాఫ్ట్ డిజైనింగ్, అభివృద్ధి, ఉత్పత్తి, నిర్వహణ కోసంగాను హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), సీఎస్ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (ఎన్ఏఎల్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దేశీయంగా 19 సీట్ల సారస్ను అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. భారత రక్షణ రంగంలోనూ, పౌర విమానయాన రంగంలోనూ దీన్ని వినియోగించే అవకాశం ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల మధ్య ప్రయాణానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని హెచ్ఏఎల్ సీఎండీ ఆర్. మాధవన్ తెలిపారు.
*స్పైస్జెట్, హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్- ఇండస్ట్రియల్ పార్క్లోని ఎస్ఈజడ్ ప్రాంతంలో అతిపెద్ద నిల్వ- పంపిణీ- వర్తక సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సిటీలో ఇది రానుంది. దీనిపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ ఎస్ఈజడ్ (జీహెచ్ఏఎస్ఎల్) తో ఒప్పందం కుదుర్చుకుంది.
*కరోనా వైరస్ మహమ్మారి భయాలతో స్టాక్ మార్కెట్లో భారీ విక్రయాలు చోటు చేసుకోవడంతో శుక్రవారం నాటి ట్రేడింగ్లో సూచీలు లోయర్ సర్య్కూట్ను తాకాయి. దీంతో ట్రేడింగ్ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. మార్కెట్ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే సూచీలు లోయర్ సర్క్యూట్లకు పడ్డాయి. స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకుల్ని అరికట్టేందుకు ఎక్స్ఛేంజీలు మూడు దశలో సర్క్యూట్లను ఏర్పాటు చేస్తాయి. 10 శాతం, 15 శాతం, 20 శాతం మేర సూచీలు పతనమైతే ట్రేడింగ్ నిలిపివేస్తారు. దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.