కరోనా దెబ్బకు అమెరికా గజగజలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యాధి నివారణకు బిలియన్ల కొద్దీ డాలర్లను అమెరికా ఖర్చు చేస్తోంది. ఆ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. అమెరికావ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలను ఇప్పటికే మూసేశారు. క్రమేపీ అన్ని విశ్వవిద్యాలయాలను కరోనా కనుమరుగయ్యేవరకు మూసి వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోని వివిధ విశ్వ విద్యాలయాల్లో వేలాది మంది తెలుగు విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో కొందరు యూనివర్సిటీ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నారు. వీరు నిరాశ్రయులుగా మారారు. ఈ పరిస్థితులను గమనించిన తానా తెలుగు విద్యార్ధుల కోసం ప్రత్యెక హెల్ప్ లైన్ ను ప్రారంభించింది. నిరాశ్రయులైన విద్యార్ధులకు వసతి, భోజన సౌకర్యం కల్పించడానికి అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న తానా సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1-855-OUR-TANA పేరుతో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఈ నంబర్లలో తమను సంప్రదించాలని తానా అద్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, పాలకవర్గ సభ్యుడు కొల్లా అశోక్ బాబు తెలిపారు.
అమెరికాలో తెలుగు విద్యార్ధులకు కరోనా షాక్
Related tags :