ఉత్తర్ప్రదేశ్లో 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 350 సీట్లు గెలుస్తామని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇటీవల ఓ జ్యోతిషుడు ఈ విషయాన్ని తన చేయి చూసి చెప్పారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడతామన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇటీవల విమానంలో దిల్లీ వెళుతున్నప్పుడు ఓ జ్యోతిషుడు నా చేయి చూసి కష్టపడి పనిచేస్తే 350 సీట్లు సాధిస్తారని అన్నారు. మీరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్టే కష్టపడి పనిచేసి 2022 ఎన్నికల్లో ఆయన చెప్పిన దానికంటే ఒక్క సీటు ఎక్కువే తెచ్చుకుంటా’’ అని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి భాజపా 300 సీట్లు గెలవొచ్చేమో గానీ, నిజాయతీతో కష్టపడి పనిచేసి తాము 351 సీట్లు సాధిస్తామని అన్నారు.
విమానంలో జ్యోతిష్యుడు నా విజయం తథ్యమన్నాడు
Related tags :