స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పై సీఎం జగన్ ఆగ్రహం
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం:
నిమ్మగడ్డ రమేష్ చేసిన వ్యాఖ్యలు భాద కలిగించాయి
ఈసీ రమేష్ విచక్షణ కోల్పోయాడు
ఎవరైనా అధికారి పనిచేయాలంటే కులానికి, ప్రాంతానికి, రాజకీయాలకు అతీతంగా పని చేయాలి
కరోనా సాకు చూపి ఎన్నికలు వాయిదా వేస్తారా?
అదే ప్రెస్ మీట్లో పోలీసుల మీద చర్యలు తీసుకుంటారా?
కరోనాతో ఎన్నికలు వాయిదా అంటున్నారు, మరోవైపు అధికారులును బదిలీ చేస్తున్నారు
చంద్రబాబు నియమించిన వ్యక్తే నిమ్మగడ్డ రమేష్
అధికారులని బదిలీ చేసే అధికారం ఈసీకి ఎక్కడిది
అధికారం 151 సీట్లు ఉన్న, ఈసీదా
ఎవడో ఆర్డర్ ఇస్తున్నాడు, రమేష్ ఆ ఆర్డర్ చదువుతున్నాడు
అధికారులను తప్పించే అధికారం నీకు ఎక్కడినుంచి వచ్చింది
ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చారు, ఈ ఆర్డర్ తయారవుతుంది అన్న విషయం ఈసీ సెక్రటరీకె తెలియదు
ఈసీ రమేష్ విచక్షణ కోల్పోయాడు, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
చంద్రబాబుది రమేష్ ది ఒకే సామాజిక వర్గం
ఇళ్ళ పట్టాల పంపిణి ఆపేయ్యలన్నారు
చంద్రబాబు కోసమే ఎన్నికల వాయిదా
ఇష్టం వచ్చినట్లు ఎన్నికలు వాయిదా వేస్తున్నారు
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రమేష్ ని ఈసిగా నియామకం జరిగింది
పోలీసుల గురించి గర్వంగా చెబుతా, వాళ్ళు ఎక్కడ ప్రేక్షక పాత్ర వహించలేదు
పేదలకు మంచి జరగడం ఈసీకి ఇష్టం లేదు
కలెక్టర్లు, ఎస్పీలని బదిలీ చేస్తే ఇక మేము ఎందుకు
ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎవరితోనైనా చర్చించార?
ఈసీ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసాం..
పిలిచి మాట్లాడమని కోరాం…
చూస్తూ ఊరుకోం ఇంకా పైకి తీసుకుపోతాం.