Sports

నీకు గొయ్యి తవ్వుతా

Chris Gayle Hindi Speaking Video

వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ తన బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేయడమే తెలుసు. కానీ తనదైన శైలిలో హిందీ డైలాగులు చెబితే ఎలా ఉంటుందో తెలుసా? తెలియకపోతే కింద వీడియో చూడండి. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, సిక్సుల వీరుడు యువరాజ్‌ సింగ్‌తో కలిసి గేల్‌ ఒక సరదా వీడియోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ హిందీ డైలాగ్‌ చెప్పి నవ్వులు పూయించాడు. ఆ వీడియోలో యువీ.. గేల్‌ వెనుక ఉండి డైలాగ్‌ను అందివ్వడం కనిపించింది. దీంతో గేల్‌ చాలా హాస్యాస్పదంగా ఆ డైలాగ్‌ చెప్పాడు. ‘నా ఆత్మవిశ్వాసంతో నీ చావుకు గొయ్యి తవ్వుతా’ అనే అర్థం వచ్చేలా విండీస్‌ క్రికెటర్‌ పేర్కొన్నాడు. దీంతో యువీ యూనివర్స్‌ బాస్‌ పలికిన సంభాషణకు నవ్వులు ఆపుకోలేకపోయాడు. మరోవైపు గేల్‌ ఈసారి ఐపీఎల్‌లో కింగ్స్‌ XI పంజాబ్‌ తరఫున బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన 13వ సీజన్‌ కరోనా వైరస్‌ కారణంగా వచ్చే నెల 15కు వాయిదా పడింది.